ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖ్యమంత్రి

Published : Apr 19, 2018, 04:18 PM ISTUpdated : Apr 19, 2018, 04:19 PM IST
ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖ్యమంత్రి

సారాంశం

బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయనతో పాటు బీహార్ లో ఖాళీ అయిన 11 ఎమ్మెల్సీ సీట్లు కూడా ఎలాంటి ఫోటీ లేకుండా ఏకగ్రీవమయ్యాయి.  బీహార్ లో ఖాళీ అయిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు మంత్రులు సుశీల్ కుమార్ మోదీ, మంగళ్ పాండేలు కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవమయ్యారు. మొత్తం 11 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలవగా ఇందుకోసం నామినేషన్ వేసిన అందరు అభ్యర్థులు ఎలాంటి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవమవడం విశేషం. అధికార జేడియూ నుండి నితీష్ కుమార్, రామేశ్వర్ మహత్, ఖలీద్ అన్వర్‌లు, మిత్రపక్షం బిజెపి నుండి సంజయ్ పవన్, సుశీల్ కుమార్ మోదీ, మంగళ్ పాండే లు ఎమ్మెల్సీలుగా నెగ్గారు. ఇక ప్రతిపక్ష ఆర్జేడీ నుండి లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవి, రామచంద్ర పూర్వే, సయీద్ ఖుర్షీద్‌,సంతోష్ మాంఝీ లు, కాంగ్రెస్ నుండి  ప్రేమ్ చంద్‌ లు పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుపొందారు.  

బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయనతో పాటు బీహార్ లో ఖాళీ అయిన 11 ఎమ్మెల్సీ సీట్లు కూడా ఎలాంటి ఫోటీ లేకుండా ఏకగ్రీవమయ్యాయి. 

బీహార్ లో ఖాళీ అయిన ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు మంత్రులు సుశీల్ కుమార్ మోదీ, మంగళ్ పాండేలు కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవమయ్యారు. మొత్తం 11 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలవగా ఇందుకోసం నామినేషన్ వేసిన అందరు అభ్యర్థులు ఎలాంటి ఎన్నికలు లేకుండా ఏకగ్రీవమవడం విశేషం. అధికార జేడియూ నుండి నితీష్ కుమార్, రామేశ్వర్ మహత్, ఖలీద్ అన్వర్‌లు, మిత్రపక్షం బిజెపి నుండి సంజయ్ పవన్, సుశీల్ కుమార్ మోదీ, మంగళ్ పాండే లు ఎమ్మెల్సీలుగా నెగ్గారు. ఇక ప్రతిపక్ష ఆర్జేడీ నుండి లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవి, రామచంద్ర పూర్వే, సయీద్ ఖుర్షీద్‌,సంతోష్ మాంఝీ లు, కాంగ్రెస్ నుండి  ప్రేమ్ చంద్‌ లు పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుపొందారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !