నిన్న ‘గాలి’ .. నేడు ‘గడ్కరి’

Published : Dec 04, 2016, 12:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
నిన్న ‘గాలి’ .. నేడు ‘గడ్కరి’

సారాంశం

కేంద్రమంత్రి గడ్కరీ కూతరు పెళ్లికి భారీ ఖర్చు ! అతిథుల తరలింపునకు 50 ప్రత్యేక విమానాలు

పెద్ద నోట్ల రద్దుతో ఓ సామాన్యుడు తన కూతరు పెళ్లి చేయడానికి నానా కష్టాలు పడుతున్నాడు. దేవుడు ముందు పెట్టాల్సిన మొదటి శుభలేఖ ను బ్యాంకు వాళ్లకు చూపించి డబ్బుల కోసం తిరుగుతున్నాడు.

 

ఇన్ని బాధలు పడలేక కొందరు పెళ్లినే వాయిదా వేసుకుంటున్నారు.అదేంటో పెద్ద నోట్ల ప్రభావం పెద్దింట్లో పెళ్లిల్లపై ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు.

 

నిన్నగాక మొన్న బళ్లారి ఘనుడు గాలి జనార్ధనరెడ్డి తన కూతురి పెళ్లిని దేశం ఆశ్చర్యపోయే రీతిలో భారీగా జరిపించారు.

 

ఇప్పుడు నేనేం తక్కువ తినలేదని కేంద్రమంత్రి గడ్కరీ కూడా రెడీ అయ్యారు. ఆయన తన కూతురు వివాహాన్ని అంతకంటే పెద్ద రేంజ్ లో జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 

తన కూతురు పెళ్లికి వచ్చే అతిథులను ఆహ్వానించేందుకే దాదాపు 50 ప్రత్యేక విమానాలను సిద్ధం చేయించారు.కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, అంబానీలు, అదానీలు, సినీతారలు ఇలా దేశంలోని సెలబ్రెటీలందరూ ఈ పెళ్లికి హాజరవుతారట.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu