
నోట్ల రద్దు తర్వాత ఆర్ బి ఐ రూ. 2 వేలు, రూ. 500 నోట్లను కొత్త గా విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇప్పడు దేశంలో చిల్లర కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రూ. 20, రూ. 50 నోట్లను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్ బి ఐ ఆదివారం వెల్లడించింది.
కొత్త గా వచ్చే ఈ నోట్ల లో చిన్న మార్పులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. కొత్త రూ. 20 నోట్ల నంబర్ ప్యానెల్‌లో ఇన్‌సెట్‌లెటర్‌గా ‘L’ ఉంటుంది. అలాగే, కొత్త రూ. 50 నోటు నెంబర్ ప్యానెల్‌లో ఇన్‌సెట్ లెటర్ ఉండనుంది.