బంగారం అమ్మకాలపై కేంద్రం షరతులు

Published : Mar 30, 2017, 10:32 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
బంగారం అమ్మకాలపై కేంద్రం షరతులు

సారాంశం

ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు

బంగారం అమ్మాలనుకునే వారికి నిజంగా ఇది షాకింగ్ న్యూస్. పసిడి అమ్మకాలపై కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అవసరం కోసమో లేదో ఇతర అత్యవసర పనిమీద మీరు బంగారం అమ్మాలనుకుంటే ఇప్పుడు అంతా ఈజీగా సాధ్యం కాదు. ఇన్నాళ్లు బ్లాక్ మనీ కట్టడిలో భాగంగా పెద్ద నోట్లు రద్దు చేసి ప్రజలకు షాక్ ఇచ్చిన  కేంద్రం ఇప్పుడు బంగారంపై పడింది.

 

ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఇక మీరు ఎంత బంగారం అమ్మినా కేవలం రూ. 10 వేలు మాత్రమే నగదు రూపంలో ఇస్తారు. ఉదహరణకు మీరు లక్ష రూపాయిల బంగారాన్ని అమ్మారు మీకు కేవలం రూ. 10 వేలు మాత్రమే నగదు చెల్లించి మిగిలిన రూ. 90 వేలను మీ బ్యాంకు ఖాతాలో జమచేస్తారటన్నమాట.

 

ఆ మొత్తాన్ని బ్యాంకు నుంచి మీరు విత్ డ్రా చేసుకోడానికి కూడా సరైన ఆధారాలు చూపించాలి. ఈ మేరకు కేంద్రం ఫైనాన్స్ బిల్లులో సవరణలు తీసుకురానుంది.అయితే ఈ నిబంధన అమలైతే సామాన్యులే ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే, దీనివల్ల బంగారం వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !