తెలంగాణా అసెంబ్లీకి చంద్రబాబు ప్రశంస

Published : Mar 30, 2017, 09:00 AM ISTUpdated : Mar 24, 2018, 12:13 PM IST
తెలంగాణా అసెంబ్లీకి చంద్రబాబు ప్రశంస

సారాంశం

తెలంగాణా అసెంబ్లీలో కొశ్చన్ పేపర్ల వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ప్రతిపక్షమూ సహకరించింది

తెలంగాణా అసెంబ్లీ పనితీరును, ముఖ్యంగా అక్కడి ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వానికి అందిస్తున్న నిర్మాణాత్మక సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశసించారు.

 

 ఇదెక్కడో కాదు,  వెలగపూడిలోని అసెంబ్లీలో.

 

టెన్త్ ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారంలో అసెంబ్లీలో గురువారం నాడు చర్చ జరుగుతున్నపుడు ఆయన  కొశ్చన్ పేపర్ లీకేజీ అనుమానాలను తెలంగాణా అసెంబ్లీ ఎంత సామరస్యంగా పరిష్కరించుకున్నది సభ ముందుంచారు.

 

‘ తెలంగాణా రాష్ట్రంలో 11 జిల్లాలలో కొశ్చన్ పేపర్ లీకేజీకి సంబంధించి  అనుమానాలు వచ్చాయి. అసెంబ్లీలో ఈ విషయం చర్చకు వచ్చింది. అక్కడ ప్రతిపక్ష పార్టీ  ఎలా వ్యవహరించింది?   కొశ్చన్ పేపర్ లీకయిందనే అనుమానాలు విద్యార్థు మనస్సుల్లో కల్గించి వారి ని,కుటుంబాలను ఆందోళనకు గురిచేయకండి.  పరీక్షలను రద్ద చేయడం వంటి చర్యలకు పూనుకోవద్దని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. కొశ్చన్ పేపర్లకు సంబంధించి  వివాదాలమీద దర్యాప్తు జరిపివ్యక్తుల మీద చర్యలు తీసుకోండి అని ప్రతిపక్షం సలహా ఇచ్చింది,’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

 

ఇక్కడి అపోజిషన్ పార్టీ ఏమడుగుతూ ఉందో చూడండన్నారు.

 

‘ పరీక్షలు రద్దు చేయండి. మంత్రి మీద చర్యలు తీసుకోండి.నారాయణ కాలేజీలును మూసేయండి. నారాయణ సంస్థకు కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పక్క రాష్ట్రంలోఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో ఉన్నాయి. చివరకు ప్రతిపక్ష నాయకుడి వూరు పులివెందులలో కూడా కాలేజీ ఉంది. ఆ కాలేజీ  బెదిరించి పెట్టించుకున్నారో, బతిమాలి పెట్టించుకున్నారో కూడా నాకు తెలుసు,’ అని ముఖ్యమంత్రి అన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !