నెల్లూరు రైతుల అగచాట్లు చూడండి

First Published Jul 23, 2017, 6:28 PM IST
Highlights
  • రైతుల ప్రయోజనాలకని భూములు సేకరించారు
  • ఇఫ్కో ఎరువుల కర్మాగారం పేరు చెప్పి భూములుతీసుకున్నారు
  • తర్వాత వ్యవసాయ సెజ్ అన్నారు
  • ఇపుడు ఈ భూములను కోకా కోలా కు ఇవ్వాలని చూస్తున్నారు
  • మా భూములు మాకివ్వండంటున్న నెల్లూరు రైతులు

నెల్లూరు పట్టణణంలో  రైతులు కలెక్టర్  ముత్యాల రాజు కారును అడ్డుకున్నారు. ఆయన జిల్లాపరిషత్ సర్వ సభ్య సమావేశానికి  వెళ్తాడని తెలుసుకుని మాటువేసి ఆయన కారుఅడ్డుకున్నారు. వాళ్ల సమస్యచాలా చిత్రమయింది.  వీళ్లంతా ఎపుడో భూములు పోగొట్టుకున్నారు. పూర్వం నెల్లూరు సమీపంలో  ఇఫ్కో ఎరువుల కర్మాగారం వస్తున్నదని ఈ రైతుల భూములను  ప్రభుత్వం సేకరించింది. ఇఫ్కో పరిశ్రమ రాలేదు. అపుడు రైతులుతమ భూములు తమకు వాపసు ఇవ్వండిని కోరారు. ఇవ్వడానికి కుదరదు,  ఈ భూముల్లో కిసాన్ సెజ్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. కిసాన్ సెజ్ కూడా రాలేదు.  ఇపుడు ఈ భూములను కోకాకోలా, విండ్ పవన్ కంపెనీలకు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. దీనితోరైతులు ఆగ్రహించారు. రైతుల ప్రయోజనాలకోసం అనిచెప్పి మొదట భూములు సేకరించి, వ్యాపార సంస్థలకు ఈభూములను కేటాయించాలనుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద కంపెనీలకు రైతుల భూములను అప్పచెప్పడం మానేసి వాటిని వెనక్కి ఇవ్వాలని వారు కలెక్టర్ ను కోరారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దారుణమని, ఎపుడో సేకరించిన ఈ భూములకు నష్ట పరిహారం కూడా అందని రైతులు తమలో ఉన్నారని వారు వాపోయారు. ఈ విషయం ఇంకా కోర్టులో ఉంది. ఇలాంటపుడు  ఈ భూములను కంపెనీలకు ఇవ్వవద్దని వారు కోరారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా ప్రభుత్వాలు నడుస్తున్న ఈ రోజుల్లో పోయిన భూములను రైతులు పొందగలరా, అనుమానమే.

 

 

click me!