బోఫోర్స్ కమిషన్ ని నిర్ణయించింది రాజీవ్ గాంధీయే...

First Published Jul 23, 2017, 5:25 PM IST
Highlights
  • బోఫోర్స్ ముడుపుల సూత్రదారి రాజీవ్ గాంధీయే
  • ఆ రోజుల్లో బోఫోర్స్ వ్యవహారం విచారించిన మాజీ స్వీడిస్ అధికారి వెల్లడి
  • ముడుపుల్లో నాటి స్వీడిష్ ప్రధాని ఒలఫ్ పామేకు కూడా  వాటా

30 సంవ్సరాల తర్వాత ...మరుగున పడిపోయిన బోఫోర్స్ ముడుపు కుంభకోణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముడుపుల సూత్రధారి ఎవరో కాదు, నాటి ప్రధాని రాజీవ్ గాంధీయే నని బోఫోర్స్ అరోపణల మీద స్వీడిష్ దర్యాప్తు చేసిన స్టెయిన్ లిండ్ స్ట్రాం వెల్లడించారు. భారత్ లో ఎపుడూ  బోఫోర్స్ మీద సరైన దర్యాప్తు జరగ నేలేదని ఆయన అన్నారు.  అంతేకాదు, భారత్ లో దీని మీద దర్యాప్తు జరిగితే, తాను  అనేక విషయాలను వెల్లడిస్తానని  ఆయన ఈ రోజు రిపబ్లిక్ టివికి ప్రత్యేకంగా చెప్పారు. ఇదే ఆ కథ.

 

Latest Videos

మూడు దశాబ్దాల కిందట దేశాన్ని కుదిపేసిన  బోఫోర్స్ కుంభకోణంలో కమిషన్ల పంపకాలలో రాజీవ్ గాంధీ కీలకపాత్ర వహించిన విషయం ఇపుడు బయటపడింది. ఇంతకాలం మరుగున ఉన్న ఈ విషయం రిపబ్లిక్ టివి ఇన్వెస్టిగేషన్ తో బయటకొచ్చింది. ఆ రోజు భోఫోర్స్ కుంభకోణం మీద దర్యాప్తు చేసిన స్వీడ్ పోలీసధికారి ఒకరు ఇపుడు రిపబ్లిక్ టివికి ఈ వ్యవహారాన్ని వెల్లడింాచరు. రాజీవ్ గాంధీ స్వయంగా  ఎలా ముడుపుల కథ నడిపించారో ఈ అధికారి స్టెన్ లిండ్ స్ట్రాం సుదీర్ఘంగా వెల్లడించారు. నాడు బోఫోర్స్ ముడుపుల విషయం బయటపెట్టింది  లిండ్ స్ట్రాం యే. రిపబ్లిక్ టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ముడుపుల పంపకం ఎలా జరగాలో కూడా రాజీవ్ గాంధీ నిర్ణయించారని ఆయన చెప్పారు. లిండ్  స్ట్రాం రిపబ్లిక్ టిబి ఎడిటోరియల్ అడ్వయిజర్ చిత్రా సుబ్రమణ్యంతో మాట్లాడారు. ఆ రోజులల్ బోఫోర్స్ కుంభకోణం పత్రాలను వెల్ల డించింది, ముడుపులు  చేతులు మారిన విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది చిత్రా సుబ్రమణ్యమే.  లిండ్ స్ట్రాం వయసు ఇపుడు 71 సంవత్సరాలు.  అపుడు బోఫోర్ ముడుపుల ఆరోపణలకు సంబంధించి 300 డాక్యుమెంట్లను ఆయన లీక్ చేశారు. ఆయన లీక్ చేసిన పత్రాలలో ముడుపులను ఎలా చెల్లించాలో  బ్యాంకులకు ఇచ్చిన సూచనలతో పాటు అపుడ బోఫోర్స్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసి మార్టిన్ ఆర్డ్ బో డైరీ కూడా ఉన్నాయి.లిండ్ స్ట్రాం చెప్పిన వివరాలు ఇవి:

1986లోభారతదేశం నుంచి బయలు దేరిన ఒకవిమానం ప్రయాణిస్తున్నపుడు అప్పటి ప్రధాన రాజీవ్ గాంధీ ముడుపులు గురించి కీలకమయన సూచనలు చేవారు. అప్పటి స్వీడిష్ ప్రధాని ఒలఫ్ పామే కూడా కొంత ముడుపు చెల్లించాలని రాజీవ్ గాంధీ సూచించారు. దీనికి పామె అంగీకరించారు.   ఈ సూచనల తర్వాత పామే వాటా  50 మిలియన్ స్వీడిష్ క్రోనాలను పామే కు సంబంధించిన ఒక ట్రస్టుకు బదిలీ చేశారు. ఇందులో నుంచి 30 మిలియన్ క్రోనాలను స్వీడిష్ లోని బెర్గ్ స్లేజెన్  ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేశారు.  ఇది ట్రస్టు లక్ష్యంలో ఒక అంశం. భారత్ కు వస్తున్న ముడుపులోనుంచి కొంతమొత్తాన్ని రాజీవ్ గాంధీ స్వీడెన్ ప్రధానికి కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎందుకు? ఇది ఉదారగుణమా లేక పామెను రొంపిలోకి లాగడమా.

 

తాను బోఫోర్స్ ముడుపుల మీద విచారణ జరపుతున్నపుడు ఒక్క భారతీయ దర్యాప్తు అధికారి కూడా తనను సందప్రదించలేదని ఆయన మరొక ఆశ్చర్యకరమయిన విషయం వెల్లడించారు. స్వీడిష్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ని భారతీయ దర్యాప్తు అధికారులు సంప్రదించకపోవడం చూస్తే, భారతదేశంలో ఎపుడూ బోఫోర్స్ ముడుపుల మీద సీరియస్ గా దర్యాప్తు జరగలేదని అర్థమవుతుంది.

పామె హత్యకు బోఫోర్స్ ముడుపుల వ్యవహారానికి సంబంధం ఉందా? గన్ కాంట్రాక్టులను అపేసేందుకు ఈ హత్య  జరిగిఉండవచ్చు. అయితే, దీని గురించి కొంత దర్యాప్తు జరిగినా, ఎదీ తేలలేదని లిండ్ స్ట్రాం తెలిపారు.

ఇపుడు భారతదేశంలో కొత్త ప్రభుత్వం వుంది. బోఫోర్స్ మీద మళ్లీ దర్యాప్తు జరపాలనే డిమాండ్ వుంది. మీరు సహ కరిస్తారా అని అడిగినపుడు తప్పకుండా అనిచెప్పారు.‘ ఇపుడు మీకు చెప్పిందంతా దర్యాప్తు చేసే వారికి కూడా చెబుతాను,’ అని లిండ్ స్ట్రాం చెప్పారు.

 

 

 

click me!