నెహ్రా ఈజ్ బ్యాక్..!

Published : Oct 02, 2017, 12:32 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
నెహ్రా ఈజ్ బ్యాక్..!

సారాంశం

టీం ఇండియాలో చోటు దక్కించుకున్న నెహ్రా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడే అవకాశం

టీం ఇండియాలో చోటు దక్కించుకునేందుకు గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా విజయం సాధించాడు. 8 నెలల తర్వాత తిరిగి టీం ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో భారత్ ఆడనున్న టీ20 సిరీస్ లో ఆడేందుకు ఆశిష్ నెహ్రాకు అవకాశం దక్కింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడే భారత జట్టును ప్రకటించింది.

ఆ జాబితాలో ఆశిష్ నెహ్రా పేరు కూడా ఉంది. నెహ్రాతో పాటు దినేష్ కార్తీక్ పేరును కూడా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ మ్యాచ్ అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. వన్డే జట్టులోని రహానే, షమి, ఉమేశ్ లకు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు. అయితే.. తన భార్య అనారోగ్యం కారణంగా వన్డే సిరిస్ కి దూరమైన శిఖర్ థావన్ కి కూడా టీ 20 సిరిస్ లో ఆడేందుకు అవకాశం దక్కింది.

ఇదిలా ఉంటే.. నెహ్రాకు టీం ఇండియాలో చోటు దక్కడం పట్ల.. ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.

జట్టులోని సభ్యులు..

 విరాట్ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, మహేంద్ర సింగ్ ధోని (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌, చాహల్‌, బుమ్రా, భువనేశ్వర్‌, ఆశిష్‌ నెహ్రా, అక్షర్‌ పటేల్‌

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu