
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు రోజుకి ఒక్కొక పేరు బయటికి వస్తుంది. అయితే సిపిఐ నాయుకుడు కె నారాయణ డ్రగ్స్ కేసులో పెద్ద చేపలను వదిలేశారు, కేవలం చిన్న చేపలను మాత్రమే పట్టుకున్నారని ఆయన ఆరోపించారు.
విలేకర్ల సమావేశంలో మాట్లాడిన నారాయణ డ్రగ్ వెనకున్న పెద్ద తలకాయలను తప్పించి కేవలం ఎక్కడొ చిన్న తప్పు చేసిన వారిని పట్టుకొని వేలాడుతున్నారని. డ్రగ్స్ కేసు వెనుక రాజకీయ నాయకులు కూడా ఉన్నారని, వారి పేర్లను బహిర్గతంచేయ్యాలని ఎక్సైజ్ శాఖను, సిట్ టీం ను ఆయన కోరారు. సినిమా రంగంలో కొంత మంది తప్పు చేస్తే ఇండస్ట్రీ అందరిని బలి చేయ్యడం తగదని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే డ్రగ్స్ కేసులో సంబంధం ఉన్న తమ నాయకుల పైన కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్ సేవించే వారిలో చిన్న పిల్లలు ఉండటం చాలా భాదకరం అన్నారు. డ్రగ్స్ సరఫరా అవుతున్న స్కూళ్లను తక్షణమే ప్రభుత్వం మూసివేయ్యాలని ఆయన డిమాండ్ చేశారు.