ఇండియాలో ప్ర‌తి 10 సెకన్ల‌కు ఒక సైబర్ ఎటాక్.

Published : Jul 22, 2017, 08:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ఇండియాలో ప్ర‌తి 10 సెకన్ల‌కు ఒక సైబర్ ఎటాక్.

సారాంశం

భారత్ లో పెరిగిన సైబర్ దాడులు. ప్రతి పది సెకన్లకు ఒక దాడి.  

సైబర్ నేరగాళ్లు పెరిగిపోతున్నారు. ఈ మ‌ధ్య వాన్నా క్రై ర్యాంస‌మ్ వేర్ ప్ర‌పంచాన్ని భ‌య‌పెట్టింది. దాని భాధితులు ఇండియాలో కూడా ఉన్నారు. కానీ అంత‌కు మించిన సైబ‌ర్ ఎటాక్ లు మ‌రిన్ని జ‌రుగుతున్నాయి.ఇదే విష‌యాన్ని  ఐసీఈఆర్‌టీ (ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జేన్సీ రెస్పాన్స్ టీం) తెలిపింది. కేంద్రానికి ఇచ్చిన నివేధిక ప్ర‌కారం భార‌త‌దేశంలో అత్య‌ధికంగా సైబ‌ర్ నేర‌గాళ్లు దాడుల‌కు పాలుప‌డుతున్న‌ట్లు తెలిపింది.

ఇండియా వ్యాప్తంగా ప్ర‌తి 10 సెకన్ల‌కు ఒక సైబ‌ర్ ఎటాక్ జ‌రిగినట్లు అధికారులు గుర్తించార‌ని తెలిపింది. గ‌తం ఆరు నెల‌లుగా జ‌న‌వ‌రి నుండి జూన్ వ‌రకు 27,482 సైబ‌ర్ దాడులు జ‌రిగిన‌ట్లు సైబ‌ర్ అధికారులు కేసులు న‌మోదు చేసుకున్నారు. ఇందులో అత్య‌ధికంగా విదేశాల నుండి  ఇండియా మీద సైబ‌ర్ అటాక్ చేస్తున్న‌ట్లు  ఐసీఈఆర్‌టీ గుర్తించింది. అందులో కేవ‌లం 10 శాతం కేసుల‌కు మాత్ర‌మే ప‌రిష్కారం దొరుకుతుంద‌ని తెలిపారు


2016 సంవ‌త్స‌రంలో ప్ర‌తి 12 సెక‌న్ల‌కు ఒక దాడి జ‌రిగింద‌ని. ఇప్పుడు ఆ సంఖ్య 10 సెక‌న్లకు ఒక సైబ‌ర్ దాడి జ‌రుగుతుంద‌ని ఐసీఈఆర్‌టీ సంస్థ తెలిపింది. ఈ స‌మాచారాన్ని హోం శాఖ‌కు పంపామ‌ని ఆ సంస్థ తెలిపింది.  

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !