అడ్డంకుల నడుమే గోపిరెడ్డి పాదయాత్ర

Published : Oct 23, 2017, 02:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
అడ్డంకుల నడుమే గోపిరెడ్డి పాదయాత్ర

సారాంశం

తిరుమలకు పాదయాత్ర చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యే జగన్ సీఎం కావాలని కోరుతూ తిరుమలకు పాదయాత్ర అడ్డంకులు సృష్టిస్తున్న టీడీపీ  కార్యకర్తలు

వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురౌతున్నాయి. అయినప్పటికీ ఆయన  పాదయాత్రను కొనసాగిస్తున్నారు. జగన్ ముఖ్య మంత్రి కావడమే ధ్యేయంగా నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఆయన అలా పాదయాత్ర ప్రారంభించారో లేదో.. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ఎమ్మెల్యే పాదయాత్రను అడ్డుకున్నారు. అదే సమయంలో టీడీపీ కార్యర్తల ర్యాలీ ఉందంటూ పోలీసులు హడావిడి చేశారు. దీంతో ఎమ్మెల్యే పాదయాత్రకు ఆటంకం ఏర్పడింది.  టీడీపీ నేతల ర్యాలీ ముగిసేవరకు ఎమ్మెల్యే పాదయాత్రను పోలీసులు నిలిపేవారు. వారి ర్యాలీ అనంతరం గోపిరెడ్డి తిరిగి తన పాదయాత్రను ప్రారంభించారు.

రోజుకి 30కిలోమీటర్ల మేర గోపిరెడ్డి పాదయాత్ర సాగుతోంది. ఈ పాదయాత్ర చేపట్టి సోమవారానికి మూడు రోజులుకాగా.. ఆయన పాదయాత్రకు టీడీపీ కార్యకర్తలు ఏదోఒక విధంగా ఆటంకం కలిగిస్తున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా.. తాను తన పాదయాత్రను పూర్తి చేసి తీరతానని గోపిరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu