నంద్యాలలో టిడిపికి వచ్చింది పాజిటివ్ వోటు

First Published Aug 28, 2017, 11:38 AM IST
Highlights

నంద్యాలలో ఎన్నికల్లో ప్రజలు టిడిపి పాలనను మెచ్చకుని వోటేశారు,కసితీరా  వైసిపిని వ్యతిరేకించారని టిడిపి అధ్యక్షుడు సోమిశెట్టి అంటున్నారు

నంద్యాల ఉప ఎన్నికల లో  ఓటింగ్ సరళి, టిడిపికి వస్తున్న మెజారిటీ  అసాధారణమయిందని, ఇది టిడిపికి వచ్చిన పాజిటివ్ ఓటు అని జిల్లా టిడిపి అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

నంద్యాల ఎన్నికల ప్రకటన కు  ముందు టిడిపి అధ్యక్షుడు చం ద్రబాబునాయుడు ఇచ్చిన వరాలలో భాగంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు  టిడిపి అధ్యక్షు లయ్యారు.దీని వల్ల  వైశ్య వర్గానికి చెందిన వెంకటేశ్వర్లు నంద్యాల పెద్ద ఎత్తున ఉన్న వైశ్యులను టిడిపికి అనుకూలంగా మార్చేందుకు కృషి చేయాల్సిందే. నంద్యాలలో ముస్లింల తర్వాత వైౌశ్యల వోట్లే ఎక్కువ.ఈ వోట్ల   కోసమే చంద్రబాబు నాయుడు సోమిశెట్టికి పదవి ఇచ్చారని భావించారు.జిల్లా టిడిపి అధ్యక్షుడిగా సోమిశెట్టి విపరీతంగా నంద్యాల ప్రచారంలో పాల్గొన్నారు. టిడిపి పుట్టినప్పటినుంచి పార్టీలో కొనసాగుతున్నీ సీనియర్ నాయకుడు సోమిశెట్టి. జిల్లాలో ఎందరో నాయకులు టిడిపిలో చేరారు. మారారు.  స్థిరంగా నిలబడిన కొద్ది మంది లో సోమిశెట్టి ఒకరు.

నంద్యాల ఎన్నికల ఫలితాల మీద ఏషియానెట్ తో ఆయన మాట్లాడారు.

‘‘ఇది ప్రచారం వల్లనో, మరొకదాని వల్లనో పడిన ఓటు కాదు, ఇది గత మూడేళ్ల చంద్రబాబు పాలనను చూసి, సంతృప్తి చెంది, తెలుగుదేశం అభ్యర్థికి వేసిన వోటు. జనం మెచ్చి వేసిన వోటు. ఈ వోటింగ్ సరళిలో ప్రజలు కసితీరా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు. మనసారా  తెలుగు దేశం పార్టీని  సమర్థించారు,’’ అని అన్నారు.

’నంద్యాల ఫలితం రాష్ట్ర వ్యాపితంగా ప్రజలలో కనిపిస్తున్న ధోరణిని ప్రతిబింబించింది.  తెలుగుదేశ ప్రభుత్వం విధానాలకు పూర్తిగా ప్రజలు మద్ధతునిస్తున్నారని నంద్యాల లో రుజువయింది. దీని ప్రభావం 2019లో కూడా ఉంటుంది. నంద్యాల వోటర్లు వైసిపి అన్ని విధాల తిరస్కరించారు. ఛీ కొట్టారు,’’ అని సోమిశెట్టి వ్యాఖ్యనించారు.

click me!