వేల కోట్ల లాటరీ ఆమెకు.. తిప్పలు పోలీసులకు..

First Published Aug 27, 2017, 3:04 PM IST
Highlights
  • ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.4846 కోట్ల పై చిలుకే.
  • అమెరికా చరిత్రలోనే ఒకే టిక్కెట్‌పై వేల కోట్లు గెలుచుకున్న వ్యక్తిగా  ఆమె నిలిచారు.

ఓ మహిళ లాటరీలో వేల కోట్లు గెలుచుకుంది. ఇందుకు ఆమె సంతోషంగానే ఉంది. కానీ అక్కడి పోలీసులకు తిప్పలు మొదలయ్యాయి. ఎవరికో లాటరీ తగలితే.. పోలీసులకు వచ్చిన సమస్య ఏమిటి అదే కదా మీ ప్రశ్న.. ఇంకెందుకు ఆలస్యం చదవండి..

 

మావిస్ వాన్ జిక్(53) అనే మహిళ మసాచ్యుసెట్స్‌లో ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు.  ఆమె ఇటీవల ఓ లాటరీ కొనుగోలు చేయగా అందులో విజేతగా నిలిచారు. 758.7 మిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాలా రూ.4846 కోట్ల పై చిలుకే.

 

అమెరికా చరిత్రలోనే ఒకే టిక్కెట్‌పై వేల కోట్లు గెలుచుకున్న వ్యక్తిగా  ఆమె నిలిచారు. బుధవారం డ్రా తీయగా... ఆమెకు జాక్‌పాట్‌ వచ్చినట్లు గురువారం ప్రకటన వెలువడింది.  ఇన్ని రోజులు చాలా కష్ట పడి ఉద్యోగం చేశానని ఈ లాటరీ తగలడం వల్ల ఇక తాను ఈ ఉద్యోగం చేయబోనంటూ ఆమె సంతోషంగా తెలియజేశారు.

 

ఇద్దరు పిల్లల తల్లి అయిన మావిస్‌ భర్త విలియం.. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. దీంతో అప్పటి నుంచి ఇంటి బాధ్యతను ఆమె మోస్తున్నారు. ఈ లాటరీ ద్వారా తన కష్టాలు తొలగిపోయాయని మావిస్ సంతోషం వ్యక్తం చేశారు.

 

కాగా.. అంత పెద్ద మొత్తాన్ని ఆమె గొలెవడంతో ఆమె పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. 2015 నవంబర్ లో క్రియాగోరీ బ్రచ్ అనే వ్యక్తి కూడా లాటరీ ద్వారా 434,272 డాలర్లు గెలచుకున్నారు. ఆయన ఆ మొత్తాన్ని గెలుచుకున్న రెండు నెలలకు.. ఏడుగురు వ్యక్తులు బ్రచ్ ఇంటిపై దాడి చేసి అతనిని దారుణంగా హత్య చేశారు. బ్రచ్ లాటరీ గెలుచుకున్నాడని పబ్లిక్ గా ప్రకటించడం వలనే అతనిని హత్య చేశారని  బ్రచ్ కుటుంబసభ్యులు వాపోయారు.

 

తాజాగా మావిస్ కూడా లాటరీ గెలుపొందడంతో.. ఆమె అడకపోయినా పోలీసులు ఆమెకు భద్రత కల్పిస్తున్నారు. డబ్బు..  కోసం ఎంతటి కిరాతకానికైనా తెగించే వారు చాలా మందే ఉన్నారు. అందుకే మావిస్ ని రక్షించుకునేందుకు పోలీసులు తిప్పలు పడుతున్నారు.

click me!