నమాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా...?

First Published Mar 9, 2017, 2:12 PM IST
Highlights

నమాజ్ చేయడం వల్ల  లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తన తాజా అధ్యాయనంలో స్పష్టం చేసింది.

ముస్లింలు చేసే పవిత్ర ప్రార్థన నమాజ్ పై ఓ యూనివర్సిటీ పరిశోధనలు చేసే కొన్ని ఆసక్తికర అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది.

 

నమాజ్ చేయడం వల్ల దిగువ వెన్నునొప్పి ( లోయర్ బ్యాక్ పెయిన్) వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తన తాజా అధ్యాయనంలో స్పష్టం చేసింది.

 

మోకాళ్ల, నడుము, తల భాగం  అంతా ఓ క్రమపద్ధతిలో వంచి రోజూ నమాజ్ చేసేవారికి వెన్నునొప్పులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వెల్లడించింది.

 

ప్రపంచవ్యాప్తంగా ఉండే దాదాపు 1.6 బిలియన్ ల ముస్లింలు మక్కా దిశగా రోజుకు 5 సార్లు  నమాజ్ చేస్తుంటారని పేర్కొంది.

 

నమాజ్ తో పాటు యోగా చేసేవారిలోనూ లోయర్ బ్యాక్ పెయిన్ సమస్య తక్కువగా ఉంటుందని బింగ్హంటన్ యూనివర్సటీకి చెందిన ప్రొఫెసర్ కసానే పేర్కొన్నారు.

 

శారీర్ ఒత్తడి, మానసిక వ్యాకులతను తగ్గించేందుకు చక్కటి పరిష్కారంగా నమాజ్ ను పేర్కొన్నవచ్చని ఆయన తెలిపారు.

 

నాడీ సంబంధిత రుగ్మతల నివారణలోనూ ఈ ప్రార్థనలు ప్రభావం చూపుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని చెప్పారు.

 

తమ అధ్యయన వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ లో ప్రచురితమైనట్లు తెలిపారు.

 

click me!