
గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ ఎంపి స్థానానికి రాజీనామా చేస్తున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి లో క్ సభకు గెలిచిన ఏకైక కాంగ్రెస్ నాయకుడాయనే. అయితే, తర్వాత గత ఏడాది జూన్ లో టిఆర్ ఎస్ లో చేరిపోయారు. నిజానికి ఆయనెపుడో లోక్ సభకు రాజీనామా చేస్తారని, ముఖ్యమంత్రి కెసిఆర్ క్యాబినెట్ లోచేరతారని అనుకున్నారు. ఎందుకో అది జరగలేదు. ఇపుడు ఆయన లోక్ సభ స్థానానికి రాజీనామా చేస్తున్నారు. రెండు మూడు రోజులలో నే స్పీకర్ సుమిత్రా మహాజన్ కు స్వయంగా లేఖ ను అందిస్తారని తెలసింది. అంటే, టిఆర్ ఎస్ తెలంగాణలో ఫిరాయింపుల పర్వం తర్వా తమొట్టమొదటి సారిగా ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నది. బహుశా ఆంధ్రప్రదేశ్ నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమయిన మెజారిటీ గెలుపొందడంతో కెసిఆర్ స్ఫూర్తి పొందినట్లున్నారు. ఎందుకంటే, నంద్యాల గెలుపు తెలుగుదేశం కార్యకర్తలలో 2019 గెలుపు మీద ఎనలేని ఆత్మ విశ్వాసం పెంపొందించింది. ఇలాంటి ప్రయోగమే కెసిఆర్ కూడా చేయాలనుకుంటున్నారు. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఒక ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి గెలిస్తే, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత లేదని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఉద్యమిస్తున్న జెఎసి ఛెయిర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్ కు, కాంగ్రెస్ నేతలకు జవాబు చెప్పవచ్చు. ప్రభుత్వాన్ని విమర్శించకుండా వారి నోటికి తాళం వేయవచ్చు.
పోతే, సుఖేందర్ రెడ్డి ఇక్కడి నుంచి మళ్లీ పోటీచేయకపోవచ్చని చెబుతున్నారు. ఆయనను అత్యంతకీలకమయిన రైతు సమితి సమన్వయ కర్తగా నియమిస్తారని వినబడుతూ ఉంది. ఈ రైతు సమితియే 2019లో తెలంగాణ రాష్ట్రసమితిని గట్టెక్కించేందని కూడా పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఎందుకంటే, ఎకరానికి ఎనిమిది వేల రుపాయల నగదు పంపిణిని చేపట్టే భారీ కార్యక్రమ ాన్ని పర్యవేక్షించేది ఈ సమితియే. దీనికి క్యాబినెట్ హోదా ఉంటుంది. అందువల్ల కెసిఆర్ ఇక్కడి నుంచి మరొక ముఖ్యుడిని ఉప ఎన్నికలకు నిలబెడతారని అంటున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి