పేరు ఎన్టీఆర్ ది...ఫొటో మాత్రం..

First Published Sep 23, 2017, 7:36 AM IST
Highlights
  • అవసరానికి వాడుకుని వదిలేయటంలో చంద్రబాబునాయుడును మించిన వారు ఇంకోరు లేరన్న విషయం ఎన్నోమార్లు రుజువైంది.
  • ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదిగిన విషయం అందరూ చూసిందే.
  • అధికారంలోకి వచ్చిందగ్గర నుండి చాలా పథకాలకు ఎన్టీఆర్ పేరు పెట్టారు కానీ అవి ఏమాత్రం అమలవుతున్నయో ఎవరికీ తెలీదు.

అవసరానికి వాడుకుని వదిలేయటంలో చంద్రబాబునాయుడును మించిన వారు ఇంకోరు లేరన్న విషయం ఎన్నోమార్లు రుజువైంది. ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదిగిన విషయం అందరూ చూసిందే. తర్వాత అదే ఎన్టీఆర్ ను పదవిలో నుండి లాగేసి ముఖ్యమంత్రైన వైనం కూడా అందరికీ తెలిసిందే. చివరకు పార్టీని కూడా తన గుప్పిట్లో పెట్టేసుకున్నారు. అసలు టిడిపిని స్ధాపించింది ఎన్టీఆరే అయినప్పటికీ టిడిపికి ఎన్టీఆర్ కు ఏమాత్రం సంబంధం లేదని చెప్పించిన ఘనుడు చంద్రబాబు. ఇంత చేసి ఎన్టీఆర్ ను మానసిక క్షోభకు గురిచేసినా మళ్ళీ అవసరం వస్తే మాత్రం వాడుకునేది ఎన్టీఆర్ ఫొటోనే.

చంద్రబాబు సిఎం అయిన కొత్తలో ఎన్టీఆర్ ఫొటో అన్నది ఎక్కడా కనబడకుండా చేసేసారు. ఎప్పుడైనా జనాల్లోకి వెళ్ళాల్సి వస్తే మాత్రం మళ్ళీ ఎన్టీఆర్ ఫొటోను ముందుంచేవారు. అంతెందుకు మొన్నటి ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ ఫొటోనే ఎక్కడబడితే అక్కడ వాడుకున్నారు. ఎన్టీఆర్ పేరుతో ఎన్నో పథకాలు ప్రకటించారు. అంటే జనాల్లో అన్నగారిపై ఉన్న అభిమానం గురించి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టే అవసరానికి మాత్రం పేరు వాడుకుంటున్నారు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే, అధికారంలోకి వచ్చిందగ్గర నుండి చాలా పథకాలకు ఎన్టీఆర్ పేరు పెట్టారు కానీ అవి ఏమాత్రం అమలవుతున్నయో ఎవరికీ తెలీదు. తాజాగా ‘‘ఎన్టీఆర్ బేబీకిట్’ అంటూ ఓ పథకాన్ని ప్రారంభించారు. అయితే, విచిత్రమేమిటంటే పేరు ఎన్టీఆర్ ది, కిట్ పై ఉన్న ఫొటో మాత్రం చంద్రబాబుది. ఎన్టీఆర్ పేరుతో ఉన్న పథకాల ప్రచారం అంతంతమాత్రంగా ఉండగా చంద్రబాబు పేరుతో ఉన్న పథకాలకు మాత్రం విపరీతమైన ప్రచారం ఉంటోంది. చూసారా చంద్రన్న మాయాజాలం.

click me!