38 లక్షలకు చేరిన ‘వైస్సార్ కుటుంబం’ సభ్యులు

Published : Sep 22, 2017, 04:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
38 లక్షలకు చేరిన ‘వైస్సార్ కుటుంబం’ సభ్యులు

సారాంశం

‘వైస్సార్ కుటుంబం’ కార్యక్రమం ప్రారంభమై 11 రోజులు పూర్తి  ప్రతి గడప తొక్కి కనీసం ఒకరైనా పార్టీలోకి వచ్చే లా ప్రచారం ఆసక్తి ఉన్న వారు మిస్ కాల్ తో కూడా పార్టీలో చేరవచ్చు  

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వైఎస్ కాంగ్రెస్ పార్టీని చేరువ చేసేందుకు  వైసిపి నిర్వహిస్తున్న ‘వైఎస్ఆర్ కుటుంబం’ లో ఇప్పటిదాకా 38 లక్షల మంది చేరారు.  ఈ  కార్యక్రమం సెప్టెంబర్ 11న ప్రారంభమయింది.  ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు  4.3 లక్షల వైఎస్ఆర్ సీపీ పార్టీ బూత్ కమిటీ సభ్యులకు ప్రత్యేక  శిక్షణ ఇచ్చారు. ఇది సెప్టెంబర్ 2 వ తారీఖున ప్రారంభమైంది. 

ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన సభ్యులు ఈనెల 11 నుంచి రాష్ట్రంలోని ప్రతీ గడపకు వెళ్తున్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, పెన్షన్ లతో పేదవాడు లబ్ది పొందిన రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నారు . రాష్ట్రానికి మంచి రోజులు మళ్లీ వస్తాయని భరోసా ఇస్తూ  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల గురించి వివరిస్తున్నారు . ఇంటి నుంచి ఒక్కరైనా వైఎస్ఆర్ కుటుంబంలో భాగం అయ్యేలా చేస్తున్నారు. ఇందులో పార్టీ కార్యకర్తులు విజయవంతమవుతున్నారని పార్టీ ప్రకటించింది.

ఈ కార్యక్రమం అమలుచేసేందుకు  ఆధునిక టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. 9121091210 ఫోన్ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని ఎవరైనా వైఎస్ఆర్ కుటుంబంలోభాగం కావొచ్చని వివరిస్తున్నారు . అన్నింటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలన పై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్నారు. .రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ఒకవేళ మార్కులు వేయాల్సి వస్తే ఎన్ని వేస్తారో వేయాలని అడుగుతున్నారు .

వైఎస్ఆర్ కుటుంబం లో భాగంగా ఇంటింటికి వెళ్లే కార్యకర్తలకు ఒక కిట్ ను అందచేశారు. ఈ పబ్లిసిటీ  కిట్ లో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్, విసిటింగ్ కార్డు, బాబు పాలనపై మార్కులు వేసే పత్రం, వైఎస్ఆర్ బ్యాడ్జి, వైఎస్ఆర్ కుటుంబం లో చేరిన తర్వాత వారి ఇంటికి వైఎస్ఆర్ కుటుంబం అని అంటించే స్టిక్కర్ ఉంటాయి. సెప్టెంబర్ 11 తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీవరకు 20 రోజులపాటు వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం కొనసాగనుంది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu