చంద్రబాబు గారి నోబెల్ హృదయం

Published : Jan 04, 2017, 01:29 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
చంద్రబాబు గారి నోబెల్ హృదయం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నోబెల్ బహుమానం ఒరిజినల్  కంటే 93 కోట్లెక్కువ 

నోబెల్ బహుమానం విలువ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసుకునే వందకోట్ల బహుమానం ప్రకటించాడా?  ఆంధ్ర శాస్త్రవేత్త ఎవరయినా సరే నోబెల్  ప్రయిజ్ కొడితే, వందకోట్లిస్తానని ఆయన పూర్వకాలపు రాజు లాగా ప్రకటించారు.  ఈరోజు ఆయన తిరుపతిలో ఈ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు.

 

పూర్వం, రాజుకు సోకిన వింత జబ్బు ఎంతకు నయం కాకపోతే, దేశమంతా చాటింపు వేయించేవారు. ‘మహారాజు గారి జబ్బు నయం చేసిన వారికి అర్ధరాజ్య మివ్వడమే కాకుండా, రాకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారహో’ అనే చాటింపు కథలు చందమామలో మనం చదువుకున్నాం. ఆతర్వాత ఇదే గొప్ప  ప్రకటన. చాటింపులాగే ఈ ప్రకటన కూడా టివిలో దేశమంతా తీసుకెళ్లాయి. కాకపోతే, బాబు గారి కోర్కెతీర్చందుకు  నగదు రూపంల్ బహుమతి  ప్రకటించారు.

 

 ఆరోజుల్లో  రాజుగారి  సొంత రాజ్యం  అది. ఆయన ఇష్టం.  రాకుమార్తెలంతా రాజుగారి పిచ్చితో నిత్యం అభద్రతో  బతకుతూ వుండి వుండాలి. అచ్చం, ఆ పిచ్చి మహారాజులలాగే ఈరోజు మన మహారాజు చంద్రబాబు నాయుడిగారి ప్రకటన కూడా ఉంది. వందకోట్లు ప్రకటించడమేమిటి; ఎవరి సొమ్ము? ఆయనలా, క్రికెట్ లో గెల్చినోళ్లకు, టెన్నిస్ గెల్చినోళ్లకు పంచుకుంటూ పోవడమేనా;  సరే ఇదొక రాజకీయ చర్చ. వదిలేద్దాం.

 

నోబెల్ ప్రయిజు విలువ గురించి చూద్దాం.

 

నవంబర్ 27,1895న, తాను చనిపోవడానికి ఒక ఏడాది ముందు అల్ ఫ్రెడ్ నోబెల్ తాను కలలు కన్న ప్రపంచం కోసం కృషి కొనసాగించడం గురించి ఒక వీలునామా రాశారు. అందులో ఒక షరతు కూడా విధించారు. తన ఎస్టేట్ 31 మిలియన్  స్వీడిష్ క్రోనర్లు (ఇపుడు SEK 1,712 మిలియన్)  ఒక నిధిగా మార్చి, సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయమన్నాడు.

 

 దీనిమీద వచ్చే ఆదాయాన్ని ,ప్రతి ఏడాది అంతకు ముందటి సంవత్సరంలో మానవాళి మనుగడ మహత్తరమయిన సేవ చేసిన వారికి బహుమతులుగా ఇవ్వమని కోరాడు.

 

ఈ లెక్కన 2016లో SEK 8 మిలియన్ లను నోబెల్ బహుమతులకు కేటాయించారు. ఇది 1901 నాడు ఉన్న అసలు మొత్తంలో  98 శాతం.

 

2016 లో అందించిన ఎనిమిది మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అంటే $970,00 డాలర్లు. భారత దేశం కరెన్సీ ప్రకారం  రు. 66015387.00 అంటే  అక్షరాల అరు కోట్ల అరవై లక్షల పదహైదు వేల మూడు వందల ఎనబై ఏడు రుపాయలు మాత్రమే.

 

అంటే,  నోబెల్ ప్రయిజ్ కంటే 93 కోట్లు ఎక్కువగా చంద్రమహారాజు ప్రకటించారు. అంటే అది వచ్చేది చచ్చేది లేదు. మన మిచ్చేది అసలుండదని ఇలా ప్రకటించనట్లు లేదు.

 

స్కూళ్లను, కాలేజీలను  చై.నా కు అప్పచెప్పి, రాబోయే వాటిని వ్యాపారస్థులకు ఇచ్చేసి, ఉన్నస్కూళ్లలో  సగం మూసేసి, టీచర్లు లేక, వసతులివ్వక, భోజనం పెట్టక... బలమయిన చదువులను బంగాళాఖాతంలో పడేసి, చంద్రబాబు నాయుడు తన పేరతో నోబెల్ బహుమతి ప్రకటించడం వింతగా లేదూ...

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !