కెసిఆర్ ‘రైతేరాజు’ కు పోటీగా చంద్రబాబు ‘రైతు రథం’

First Published Jun 2, 2017, 5:18 PM IST
Highlights

తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు  ‘రైతే రాజు’ అంటే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘రైతురథం’ అంటున్నారు. కెసిఆర్ ప్రతిరైతుకు ఎకరానికి ఎనిమిది వేలు నగదు సహాయం చేయాలనుకుంటూంటే,నాయుడు ఏకంగా ఒక ట్రాక్టర్ ఇవ్వాలనుకుంటూ ఉన్నారు. కొత్త పథకం కింద ఒక్కో రైతుకు రూ.2లక్షల రాయితీ అందిస్తారు. రెండేళ్లలో 20వేల ట్రాక్టర్లను  అందించేందుకు నాయుడు భారీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు   ప్రతిరైతుకు ఎకరానికి ఎనిమిది వేలు నగదు సహాయం చేయాలనుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకంగా ఒక ట్రాక్టర్ ఇవ్వాలనుకుంటూ ఉన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రైతు రథం’ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. ఒక్కో రైతుకు రూ.2లక్షల రాయితీ అందిస్తూ.. రెండేళ్లలో 20వేల ట్రాక్టర్లను వారికి అందించేలా భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఖరీఫ్‌ నుంచే దీన్ని అమలులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అతి త్వరలోనే విధివిధానాలు ప్రకటించనున్నారు.

తెలంగాణా ప్రభుత్వం ‘రైతే రాజు‘ పథకం వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తుంది. ఇపుడు లబ్దిదారుల ఎంపిక కోసం సర్వే జరగుతూ ఉంది. రైతే రాజు కింద ఎరువులు కొనుగోలుకు ఎకరానికి నాలుగు వేలు చొప్పున రెండు పంటలకు మొత్తం ఎనిమిది వేలిస్తారు. పేరు యూరియా కొనుగోలు పేరుతో  ఇస్తున్నా, ఈ డబ్బును రైతు ఎందుకయినా కొనుగోలు వాడుకోవచ్చు. రెండెకాలుంటే పదహారువేలు అందుతాయి. ఈ డబ్బు నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్ లోకి వెళుతుంది.

 

ఇపుడు పోటీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు రథం తీసుకువస్తున్నది. తొొందర్లో  చంద్రన్న టాక్టర్లు రాష్ట్రమంతా తిరుగుతుంటాయి. ఈ పథకం కింద రైతుకు భారీగా సబ్సిడీ అందుతుంది.

 

ట్రాక్టర్‌ కొనుగోలు వ్యయం రూ.5.50లక్షలు ఆపైన ఉంటుంది. ఇందులో రూ.2లక్షల వరకు రాయితీగా చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ట్రాక్టరును బట్టి రాయితీ మరింత పెంచి ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో అధికంగా ఉపయోగిస్తున్న వాటితోపాటు చైనా, కొరియా, థాయ్‌లాండ్‌, తైవాన్‌ తదితర దేశాల్లో ఉండే 4వీల్‌డ్రైవ్‌ ట్రాక్టర్లను కూడా అందించే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

 

పల్లెలకే పెద్దపీట వేస్తూ తొలి ఏడాది 7వేలు, రెండో ఏడాది 10వేల ట్రాక్టర్లను అందించనున్నారు. ఇవికాక వ్యవసాయ, అనుబంధ శాఖల్లో అమలయ్యే వేర్వేరు పథకాల కింద మరో 3వేలు పంపిణీ చేస్తారు.

click me!