ఏపీలో  ఏరోసిటీ నిర్మాణానికి ఒప్పందం

Published : Oct 22, 2017, 10:07 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఏపీలో  ఏరోసిటీ నిర్మాణానికి ఒప్పందం

సారాంశం

ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో అవగాహన ఒప్పందం 5.5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీ సంసిద్ధత  

దుబాయి, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్ లో ఏరోసిటీ దశలవారీగా 5.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో  యుఎఇ లోని  మహ్మద్ అబ్దుల్ రెహమాన్ మహ్మద్ అల్ జూరానీ కి చెందిన ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన ఎకనమిక్ డెలవప్‌మెంట్ బోర్డుకు, ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీకి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఏరో సిటీ పూర్తయితే 15,000 మందికి ప్రత్యక్షంగా, 5,000 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏవియేషన్ సిటీగా నిర్మించే ఏరోసిటీ నిర్మాణంలో అత్యంత అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తారు. దేశవిదేశాల నుంచి విజ్ఞానాన్ని తీసుకురావడం (Knowledge transfer)  తమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి చెప్పారు.  భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్న  ప్రాజెక్టు అని అన్నారు. ఎక్కడ స్థాపించాలన్నదీ ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. ఏవియేషన్ సిటీ ఎల్ ఎల్ పీ ఏరోసిటీ స్థాపనకు 10 వేల ఎకరాలు అవసరమవుతుందని తెలిపింది. ఈ కంపెనీ బృందం ఈ మేరకు నవంబర్ మూడో వారంలో  అధ్యయనానికి మన రాష్ట్రానికి రానున్నది.  వచ్చే జనవరిలో దావోస్‌లో ప్రాథమిక నివేదిక అందజేస్తుంది.

ఎమిరేట్స్ కు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ హబ్ గా ఏపీ

దుబాయ్ నుంచి భారత్ కు వారానికి వెయ్యికి పైగా విమాన సర్వీసులు ఉన్నా సరిపోవట్లేదు. ఇంకా విమాన సర్వీసుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.ఆంద్రప్రదేశ్ లో మీరు సూచించిన నగరాలకు విమాన సర్వీసులు నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తాం  దుబాయ్ ప్రతినిధులు తెలిపారు.

ఏవియేషన్ అకాడమీ నెలకొల్పడానికి కూడా ఎమిరేట్స్ చొరవ తీసుకోవాలని  ముఖ్యమంత్రి  కోరారు.

సమావేశంలో ఇరువురి నుంచి మొత్తం నాలుగు ప్రతిపాదనలు వచ్చాయి.
1. ఎయిర్ పోర్ట్ 
2. రాష్ట్రంలోని 3 నగరాల నుంచి విమాన సర్వీసులు ప్రారంభం.
3. ఆంద్రప్రదేశ్ ను ఎమిరేట్స్ హబ్ గా మార్చుకోవడం.
4. ఏవియేషన్ అకాడమీ నెలకొల్పడం.

ఎమిరేట్స్ సంస్థ వారు ఈ నాలుగు ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించారు.

వీసా నిబంధనలు సులభతరం అయితే 
మరింత మార్పు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసిన ఎమిరేట్స్ ప్రతినిధులు.

బ్యాంకాక్ వీసా నిబంధనలు సడలించడంతో రోజుకు 5 విమాన సర్వీసులు నడుపుతున్నామని తెలిపారు.

వీసా నిబంధనల విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించిన భారత రాయబారి సూరి.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !