
పైకి గొప్పగా చెబుతున్నా, డబుల్ బెడ్ రూం పథకం పూర్తి చేయడం మునిసిపల్ మంత్రి కెటిఆర్ కు ఇష్టం లేదని, అందుకే డబుల్ బెడ్ రూం పనులమీద ప్రయివేటు వ్యక్తులతో కేసులు వేయించారని సీనియర్ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. తను కోర్టులో పిల్ వేసినందుకు తన మీద తీవ్ర విమర్శ చేసిన కెటిఆర్ కు ఆయన నేడు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఈ ఆరోపణ చేశారు. లేఖలో మర్రిశశిధర్ రెడ్డి పేర్కొన్న విషయాలు:
*అంబెడ్కర్ నగర్ స్లం భూమి కాకుండా ప్రైవేట్ భూములను కూడా స్కీం లో చేర్చారు.
* డబల్ బెడఁరూం ఇండ్ల పనుల పై కేటీఆరే ప్రైవట్ర్ వారితో ముందుగానే హై కోర్ట్ లో కెసులు వేయించారు.
* వాటి గురించి ప్రస్తావించకుండా నా పై బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు.
* వాస్తవాలు తెలుసుకోలేకపోతే మంత్రి పదివికి కేటీఆర్ అనర్హుడు.
*కేటీఆర్ మంత్రి పదివికి అనర్హుడా ? మోసం చేసారా ? ఆయనే జవాబు చెప్పాలి.
* అనర్హుడైతే మంత్రి పదివినుండి కే టీ ఆర్ ను తొలగించాలి.
* అంబెడ్కర్ నగర్ స్లం వాసులను మోసం చేసినట్లయితే కేటీఆర్ పై చీటింగ్ కెసు పెట్టాలి.
*నేను పేదల ప్రయోజనాలను పరిరక్షించడానికే పిల్ వేసింది.
* మొదటినుండి పేదల ప్రయోజనాల, కాపాడుతూ వచ్చాను.
*కాంగ్రెస్ పట్ల కేటీఆర్-కెసిఆర్ వాడే బాష తండ్రి-కొడుకుల ట్రేడ్ మార్క్ అని చెప్పాలి