దోసెడు మట్టి బ్యాగు విలువ రూ.11.5కోట్లు

First Published Jul 21, 2017, 3:30 PM IST
Highlights
  • చంద్రుడిపై కాలుమోపి సరిగ్గా 48 సంవత్సరాలు
  • న్యూయార్క్ లో వేలంపాట
  • 500మంది వేలంపాటలో పాల్గొన్నారు.

ఈ ఫోటోలో చూస్తున్న మట్టి బ్యాగు విలువ అక్షరాల రూ.11.5కోట్టు. నమ్మలేకపోతున్నారా.. కానీ ఇది నిజం. 
ఇది అలాంటి ఇలాంటి మట్టి కాదండి.. చంద్రుడుపై నుంచి తీసుకువచ్చిన మట్టి. అసలు విషయానికి వస్తే..    
చంద్రుడిపై మొట్టమొదట కాలు మోపిన వ్యక్తి వ్యోమగామి  నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ . కాగా.. 
 తొలిసారి  ఒక మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టి సరిగ్గా  గురువారానికి(జులై 20)48 సంవత్సరాలు. 

ఈ సందర్భంగా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్ర గ్రహంపై సేకరించి తెచ్చిన మట్టిని గురువారం న్యూయార్క్ లో
 వేలంపాట వేశారు. ఈ మట్టిని  వేలంలో  1.8 మిలియన్ డాలర్లు అంటే మన కరన్సీలో రూ.11.5కోట్లకు
 కొనుగోలు చేశారు. 

1969 జులై 20న మొదటి వ్యోమనౌక అపోలో 11 చంద్రుడిపై దిగింది.  చంద్రుడిపై మొట్టమొదట 
కాలుమోపిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌... ఆ సమయంలో తనతో పాటు ఓ సంచిని తీసుకెళ్లి కొంత మట్టిని సేకరించారు. 
అప్పటి నుంచి యూఎస్‌ నేషనల్‌ కలెక్షన్స్‌లో ఈ బ్యాగును ఉంచారు. అయితే ఈ బ్యాగు గొప్పతనం  గురించి 
 తెలియక గతేడాదికి వరకు  ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. 

2014లో మూడు సార్లు వేలం వేసినా... ఒక్కరు కూడా బిడ్డింగ్‌ సమర్పించలేదు. అయితే... బ్యాగులోని మట్టి 
చంద్రుడిపైదేనని, అది కూడా అపోలో 11 దిగినప్పటిదని నాసా ఇటీవల వెల్లడించింది. దీంతో ఈ బ్యాగు
 ప్రాచుర్యం పొందింది. ఈ బ్యాగును వారం రోజుల పాటు ప్రదర్శనకు ఉంచి.. గురువారం వేలం వేశారు. 
500మంది ఈ వేలంలో పాల్గొన్నారు. 

click me!