మహిళకు క్షమాపణ చెప్పిన హైకోర్టు.

Published : Aug 07, 2017, 01:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
మహిళకు క్షమాపణ చెప్పిన హైకోర్టు.

సారాంశం

న్యాయం కోసం 24 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఆ మహిళను అభినందిన న్యాయస్థానం ఇంతకాలం జాప్యం చేసినందుకు.. క్షమాపణలు

 

ఓ మహిళకు మద్రాసు హైకోర్టు క్షమాపణ చెప్పింది. న్యాయం కోసం 24 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఆ మహిళను అభినందిన న్యాయస్థానం..  ఇంతకాలం జాప్యం చేసినందుకు.. క్షమాపణలు చెప్పింది. వివరాల్లోకి వెళితే...

లోకేశ్వరం అనే యువకుడు లారీ డ్రైవర్ గా  పనిచేసేవాడు. 1993లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలోఅతను మృతి చెందాడు.  దీంతో అతనికి రావాల్సిన  పరిహారం కోసం అతని తల్లి..  గత 24 ఏళ్లగా పోరాటం చేస్తూనే ఉంది.

 

మొదట ఆమె మోటార్ వాహన చట్టం కింద కాకుండా వర్క్మెన్స్ పరిహార చట్టం కింద  పరిహారం కోరారు. ఈ చట్టం కేవలం పారిశ్రామిక ప్రమాదాలకే వర్తిస్తుంది. దీంతో ఆమె చేసుకున్న క్లైమ్ని అధికారులు నిరాకరించారు.

అనంతరం ఆమె మోటార్ యాక్సిటెండ్స్ కింద క్లైమ్ చేశారు. అయితే ఆమె తొలుత వర్క్మెన్స్ పరిహార చట్టం కింద దరఖాస్తు చేశారని..తిరిగి మోటార్ యాక్ట్ కింద పరిహారం చెల్లించలేమని లారీకి బీమా వర్తింపచేసిన నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ చేతులెత్తేసింది. కంపెనీ అభ్యంతరాన్ని తోసిపుచ్చిన ట్రిబ్యునల్ రూ 3.47 లక్షల పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అప్పీల్ను తోసిపుచ్చిన కోర్టు బాధిత మహిళకు నాలుగు వారాల్లో పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !