మోదీ మెచ్చిన కుర్రాడు... దొంగ నోట్ల ఘనుడు

First Published Dec 3, 2016, 10:49 AM IST
Highlights
  • ప్రధాని ప్రశంసలు అందుకున్న అభినవ్ వర్మ
  • ఇప్పుడు దొంగనోట్ల ముద్రిస్తూ అడ్డంగా దొరికాడు

 

మేకిన్ ఇండియాలో భాగంగా తాను రూపొందించిన పరికరంతో ప్రధాని ప్రశంసలే అందుకున్నాడు ఆ కుర్రాడు..భవిష్యత్తు భారతానికి అతనో ఆదర్శమని ప్రధానే స్వయంగా పొగిడారు.

కానీ, ఇప్పుడు ఆ కుర్రాడు దొంగ నోట్లు ముద్రిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

 

నకిలీ నోట్ల రాకెట్‌లో ప్రధాన సూత్రదారిగా నిలిచి అపఖ్యాతిని మూటకట్టుకున్నాడు.

 

పంజాబ్‌కు చెందిన ఇంజినీరు అభినవ్‌ వర్మ (21) గతేడాది ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సులో ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.

 

ఇదంతా గతంలో .. ఇప్పుడు ఆ కుర్రాడు నకిలీ నోట్ల తయరీలో నిపుణిడుగా మారాడు. తన మేధస్సును నోట్ల తయారీకి వినియోగించాడు. శుక్రవారం పంజాబ్‌లోని మొహాలీలో రూ.45 లక్షల నకిలీ కరెన్సీని తరలిస్తుండగా అతడి టీంను అత్యంత చాకచక్యంగా

పోలీసులు పట్టుకున్నారు.

 

నోట్ల రద్దు తర్వాత కర్సెనీ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని పెద్దఎత్తున నకిలీ రూ. 2 వేల నోట్లను ముద్రించడం మొదలుపెట్టాడు. దాన్ని పాత 500, 1000 నోట్లతో మార్పిడి చేసుకునేందుకు 30శాతం కమిషన్‌ తీసుకుంటున్నాడు.

 

అత్యంత సీక్రెట్ గా ఉంటున్న ఈ వ్యవహారం పెద్దఎత్తున సాగుతోంది. ఈ విషయం పసిగట్టిన పంజాబ్‌ పోలీసులు డబ్బులు తరలిస్తున్న అభినవ్ టీంను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అభినవ్‌తో పాటు అతడి సోదరుడు విశాఖ వర్మ, లూధియానాకు చెందిన సుమన్‌ గోపాల్‌ కూడా పోలీసులకు పట్టుబడ్డారు.

click me!