
ప్రధాన మంత్రి మోదీ ఏ ముహుర్తాన పెద్ద నోట్లను రద్దు చేశారో గాని... దేశంలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి..చిల్లర ఉన్నాడో శ్రీమంతుడయ్యాడు... పెద్ద నోట్లున్నవాడు బికారి అయ్యాడు.. ఏటిఎం ముందుకు వెళ్లని వారు కూడా ఇప్పుడు బ్యాంకుల ముందు క్యూలు కడుతున్నారు. ఇదంతా ఒకటైతే.. ఈ భర్యాభర్తల కథ మరొకటి.
మోదీ పెద్ద నోట్లు రద్దు చేయడం ఓ కాపురంలో చిచ్చుపెట్టింది. అదేదో డబ్బు గొడవ వల్ల అని అనుకోకండి.
మోదీ ప్రకటను భర్త వ్యతిరేకిస్తే.. ఆయన భార్య మాత్రం సమర్థించింది. ఇంకే ముంది ఇళ్లు కాస్త పార్లమెంట్ అయింది. చివరికి మీడియా ముందుకు వచ్చిన ఆ భార్యామణి మొగుడికి విడాకులైనా ఇస్తా కాని... మోదీ మాటను వ్యతిరేకిస్తే మాత్రం ఊరుకోను అని తెగేసి చెప్పింది.
https://www.youtube.com/watch?v=DEjJskuzwIs
సోషల్ మీడియాలో ఇప్పడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. రష్మీ జైన్ అనే మహిళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటనను ఆకాశానికి ఎత్తింది. దేశం కోసం ఓ మంచి నిర్ణయం తీసుకున్న పీఎంకు ఎందుకు అండగా నిలబడరు అని ప్రశ్నిస్తున్న ఆమె వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ లో వైరల్ గా మారింది.
‘పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నా భర్త విమర్శిస్తూ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.. అవసరమైతే ఆయనకి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా’ ఉన్నానని అంటున్న ఆమె వీడియో ప్రకటన సంచలనం సృష్టిస్తుంది.