డేరాలో ఎన్ని ఘోరాలు.. వెలుగు చూస్తున్న నిజాలు

First Published Sep 21, 2017, 2:26 PM IST
Highlights
  • డేరా ఆశ్రమంలో 600 అస్థిపంజరాలు బయటపడ్డాయి.
  • అంతేకాదు డేరాలో అమ్మాయిల అక్రమ రవాణా జరిగేదని, విచ్చలవిడి వ్యభిచారం ఇక్కడ సర్వసాధారణమని అధికారులు తేల్చారు.

ఊట బావిలో ఎంత తోడినా నీరు వచ్చినట్లు.. డేరా బాబా చేసిన ఘోరాలు కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నయి. ఇప్పటి వరకు డేరా ఆశ్రమంలో ఉన్న సదుపాయాలను చూసి అధికారులు సైతం నోరెళ్ల పెట్టారు.  వాటి నుంచి తేరుకోక ముందే మరొక షాకింగ్ విషయం బయటకి వచ్చింది.  డేరా ఆశ్రమంలో 600 అస్థిపంజరాలు బయటపడ్డాయి.అంతేకాదు డేరాలో అమ్మాయిల అక్రమ రవాణా జరిగేదని, విచ్చలవిడి వ్యభిచారం ఇక్కడ సర్వసాధారణమని అధికారులు తేల్చారు.

ఇక్కడి నుంచి అమ్మాయిలను విదేశాలకు పంపుతూ ఉండేవారని.. దీనికి సంబంధించి తమకు సాక్ష్యాలు లభించాయని, వాటిపై విచారణ ప్రారంభించామని వారు పేర్కొన్నారు. డేరా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు అమ్మాయిలను పంపి వ్యభిచారం చేయించినట్టు కూడా తెలుస్తోందని అన్నారు.

మనుషుల అక్రమ రవాణాతో పాటు అవయవాల వ్యాపారం కూడా జరిగినట్టు ఇటీవల వెల్లడించిన పోలీసులు, మరిన్ని రోజుల పాటు డేరాలో సోదాలు నిర్వహిస్తామని చెబుతున్నారు.

కనీస సురక్షతలను కూడా పాటించకుండా ఇక్కడ వ్యభిచారం జరిగిందని, ఎంతో మందికి గర్భస్రావాలు జరిగాయని, బాధితులు ఒక్కొక్కరుగా తామనుభవించిన బాధలపై ఫిర్యాదులు చేస్తున్నారని సిట్ అధికారి ఒకరు తెలిపారు.

 

డేరా బాబా ఆశ్రమంలో లో చాలా హత్యలు జరిగాయని అనేకరకాలైన ఆరోపణలు ఉన్నాయి .సుమారు ఐదువందల మంది కనపడలేదని..అందరిని డేరా బాబా హత్య చేయించి ఉంటారనిసందేహాలు ఉన్నాయి.
గుర్మీత్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో అధికారులు డేరా ఆశ్రమంలోని అణువణువు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే సందేహం వచ్చి తవ్వకాలు జరిపితే దాదాపు 600కు పైగా ఆస్తిపంజరాలు డేరా ఆశ్రమంలో బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతి ఆస్తిపంజరం పైనా ఒక్కో పూల మొక్కని నాటినట్టుగా కనపడుతోంది.

ఇప్పుడు బయటపడుతున్న అస్థిపంజరాలు మగవారివా ,ఆడవారికి సంభందిచినవా తేలాల్సి ఉంది. చనిపోయిన వారందరూ బాబా కి ఎదురుతిరగడం వల్లే హతమయ్యారా అనే కోణంలో కూడా కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

 ఇదిలా ఉండగా..డేరా సచ్చా సౌద ప్రాంగణంలో అస్థి పంజరాలు ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని ప్రత్యేక దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న డీఎస్పీ కుల్దీప్‌ సింగ్‌ బెనీవాల్‌ చెప్పారు. డేరా అనుచరులు తమ బంధువుల అంత్యక్రియలు తరువాత అస్థికలను తీసుకొచ్చి ఇక్కడ చల్లేవారని తెలిసిందని అన్నారు. ఒక వైపు మిడియా.. ప్రత్యక్షంగా చూపిస్తుంటే.. కుల్దీప్ ఇంత నింపాదిగా.. తమకు తెలియదు అని చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.

click me!