
హైదరాబాద్ మెహదీపట్నంలోని ఒక సినిమాలో దియోటర్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి అంబా థియేటర్ లో బాహుబలి-2 సినిమా చూస్తూ ముభషీర్ అహ్మద్ అనే వ్యక్తి మృతి చెందాడు. సినిమా చూస్తుండగా ఒక్కసారిగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దానితో ఆయన థియేటర్లోనే ప్రాణాలొదిలాడు. ధియోటర్ల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ధియోటర్ కు చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.