కొచ్చి మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ

First Published Jun 17, 2017, 1:34 PM IST
Highlights

కేరళ కొచ్చినగరంలో  మెట్రో రైలు సర్వీస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు.అనంతరం మెట్రో రైల్‌లో పవరివట్టం నుంచి పాతదిప్పళానికి నేతలు ప్రయాణించారు. యోగేశ్ షైని, సుమిత్ కుమార్ లు అపుడు ట్రెయిన్ నడిపారు.

 

 

 

Futuristic infrastructure that will contribute to India's growth...PM @narendramodi and other dignitaries on the Kochi Metro. pic.twitter.com/TA2TWlm3wp

— PMO India (@PMOIndia) 17 June 2017

 

కేరళ కొచ్చినగరంలో  మెట్రో రైలు సర్వీస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు.

 

అనంతరం మెట్రో రైల్‌లో పవరివట్టం నుంచి పాతదిప్పళానికి  ఆయన ఇతర నేతలతో కలసి ప్రయాణించారు. యోగేశ్ షైని, సుమిత్ కుమార్ లు అపుడు ట్రెయిన్ నడిపారు.

 

ప్రధాని వెంబడి రైలులో ఇండియామెట్రోమ్యాన్ గా పేరున్న ఇ శ్రీధరన్, అర్బన్ డెవెలప్ మెంట్ కార్యదర్శి రాజీవ్ గౌబ, కేరళచీఫ్ సెక్రెటరీ నళిని నెట్లో, కొచ్చి మెట్రోరైల్ ఎండి ఎలియాస్ జార్జ్ కూడా ప్రయాణించారు.

 

దేశంలో వేగంగా పూర్తైన ఇంటెగ్రేటెడ్ రైలు ప్రాజెక్టుల్లో కొచ్చి మెట్రో ఒకటి.

 

తొలిదశలో  ఆలువా-పాలరివట్టం మార్గంలో 13 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, కేరళ గవర్నర్ సదాశివం, ముఖ్యమంత్రి విజయన్ పాల్గొన్నారు.

 

అనంతరం వారు కాలూర్ స్టే డియంలో జరిగిన  కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

PM @narendramodi and other dignitaries on board the Kochi Metro. pic.twitter.com/85dG4EhkqL

— PMO India (@PMOIndia) 17 June 2017
click me!