హైదరాబాద్ పాపులర్ ఫుడ్స్.. రుచి చూశారా..?

First Published Dec 4, 2017, 3:03 PM IST
Highlights
  • హైదరాబాద్ విశేషమేమిటంటే, ఏదేని వంట హైదరాబాద్ కు రాగానే స్థానిక ఫ్లేవర్ దండుకుని ‘హైదరాబాదీ’ అయిపోతుంది. అందుకే  బిర్యానీతోపాటు కేవలం హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉన్న ఫుడ్స్ ఇంకా చాలానే ఉన్నాయి.

హైదరాబాద్ అనగానే మొదట గుర్తొచ్చేది చార్మినార్.. ఆ తర్వాత  బిర్యానీనే. అసలు సిసలు బిర్యానీ రుచి చూడాలంటే ఎవరైనా హైదరాబాద్ రావాల్సిందే. అంతలా ప్రాచుర్యం పొందింది. ప్రధానులు, ముఖ్యమంత్రులు, క్రీడాకారులు, సినీతారలు ఎందరెందరినో మెప్పించిన నగర వంటకం ఇది. నగరాన్ని సందర్శించిన ఏ పర్యాటకుడూ బిర్యానీ రుచిచూడకుండా వెనుదిరగడంటే అతిశయోక్తి కాదు. మరి బిర్యానీ ఒక్కటే హైదరాబాద్ లో పాపులరా..? అంటే కచ్చితంగా కాదు. హైదరాబాద్ విశేషమేమిటంటే, ఏదేని వంట హైదరాబాద్ కు రాగానే స్థానిక ఫ్లేవర్ దండుకుని ‘హైదరాబాదీ’ అయిపోతుంది. అందుకే  బిర్యానీతోపాటు కేవలం హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉన్న ఫుడ్స్ ఇంకా చాలానే ఉన్నాయి. అవేంటో ఓసారి మనమూ లుక్కేద్దామా..

హైదరాబాద్ చికెన్ 65..

హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమసో.. చికెన్ 65కూడా అంతే ఫేమస్.. చాలా మంది ఎంతో ఇష్టంగా తినే స్నాక్ ఇది.  దీనిని మొదట 1965లో తయారు చేశారు.. అందుకే ఈ ఫుడ్ ఐటెమ్ కి చికెన్ 65 అని పేరు పెట్టారు అనే ప్రచారం ఉంది. ఈ  ఫుడ్ తయారు చేసేసమయంలో 65 మిరియాలు వాడారని అందుకే ఈ పేరు పెట్టారని కొందరు చెబుతున్నారు. టేస్టీ టేస్టీ గా.. హాట్ హాట్ గా ఉండే ఈ చికెన్ 65 నగరవాసులకు సుపరిచితమే.

పెసరట్టు..

టిఫిన్స్ లో పెసరట్టు రుచి వేరనే చెప్పవచ్చు. పెరపప్పుతో వేసే అట్టునే పెసరట్టు అని  అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెసరట్టుకి ఫ్యాన్స్ ఎక్కువ. పల్లీ, అల్లం చట్నీతో కలిపి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.

కుబానీకా మీటా

హైదరాబాద్ లో ఫేమస్ స్వీట్ ఏది అంటే వెంటే కుబానీ కా మీటా అని చెప్పవచ్చు. మన నగరానికి వచ్చే అతిథులు కచ్చితంగా ఈ స్వీట్ ఆస్వాదిస్తారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ స్వీట్ ని వడ్డిస్తుంటారు. ఆప్రికాట్స్ తో తయారు చేసే ఈ స్వీట్ పై బాదంపప్పులు గార్నిష్ చేసి మరీ అందిస్తున్నారు.

డబల్ కా మీటా..

కుబానీ కా మీటా తర్వాత అంత ప్రాచుర్యం పొందిన స్వీట్ డబల్ కా మీటా. బ్రెడ్ ముక్కలు, పాలు, నెయ్యితో దీనిని తయారు చేస్తారు. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉంటుంది.

మిర్చి బజ్జీ..

మిర్చీ బజ్జీ.. పరిచయం అవసరం లేని స్నాక్ ఇది. నగర వ్యాప్తంగా బండ్ల మీద కూడా లభిస్తుంది,. మిర్చీ ఘాటు తినగలిగిన వారంతా వేడి వేడి బజ్జీ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

హలీమ్..

రంజాన్ పండుగ సమయంలో లభించే టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ హలీమ్. నిజాం రాజుల పరిపాలనలో తొలిసారి  ఈ హలీమ్ ని హైదరాబాద్ లో పరిచయం చేశారు. రంజాన్ మాసం మొత్తం అందరూ క్యూలు కట్టి మరీ హలీమ్ ఆరగిస్తారు. చికెన్, మటన్ మాంసానికి గోధుమలు వంటి వాటిని కలిపి తయారు చేశారు, కుల, మత బేధాలులేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు.

బగారా బైంగన్..

పాపులర్ మొగలాయి ఫుడ్  ఈ బగారా బైంగన్. మొగలుల కాలంలో నగరానికి ఈ వంటకం పరిచయం అయ్యి.. ఇప్పుడు నగర సంస్కృతిలో ఒకటిగా మారింది. హైదరాబాద్ బిర్యానీతో కాంబినేషన్ గా దీనిని తినవచ్చు.

హైదరాబాద్ కట్టి దాల్

హైదరాబాద్ కట్టి దాల్.. వేడి వడి అన్నం లేదా చపాతీలతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. కందిపప్పు, చింతపండు గుజ్జు, టమాటాలు వేసి వండుతారు.

హైదరాబాదీ మరగ్

హైదరబాదీ మరగ్ అనేది.. మటన్ సూప్. పాపులర్ రెస్టారెంట్లలో లభించే ఈ మరగ్ ని  మటన్ బోన్స్ ఉపయోగించి తయారు చేస్తారు. అంతేకాదులో జీడీపప్పు, బాదం పప్పుల పేస్ట్ ని వాడతారు. ఇది సూప్ కి మరింత ఎక్కువ రుచిని అందిస్తుంది.

మగజ్ మసాలా

ఇది కూడా ఫేమస్ హైదరాబాదీ ఫుడ్. మేక తలకాయ మాంసం అని కూడా అంటారు. పరోటా, రుమాల్ రోటీ కాంబినేషన్ లో చాలా బాగుంటంది.

లుఖ్మీ..

హైదరాబాద్ నగరంలోని పాపులర్ స్నాక్ ఐటెమ్ ఈ లుఖ్మీ. సమోసా లాగానే ఉంటుంది కాకపోతే.. సాధారణంగా మనం తినే సమోసాల్లో ఆలు కర్రీ, లేదా ఆనియన్ కర్రీ పెడుతుంటారు. కానీ లుఖ్మీలో మీట్ ఉంటుంది. చాలా రుచిగానూ ఉంటుంది.

click me!