‘‘ఫారెస్ట్ థెరపి’’.. టెన్షన్ తగ్గించేందుకు కొత్త వైద్యం

First Published Dec 4, 2017, 1:40 PM IST
Highlights
  • ‘‘ ఫారెస్ట్ థెరపి’’ దీనిని మొదట జపాన్ దేశంలో ప్రారంభించారు.
  • మానసిక, శారీరక ఒత్తిడికి లోనయ్యే వాళ్లు.. కొంత సమయం కనుక అడవిలో గడిపితే.. వారు ఆ ఒత్తిడి నుంచి కోలుకుంటారు అనే కాన్సెప్ట్ తో వచ్చింది ఈ ఫారెస్ట్ థెరపి.

తలనొప్పి, ఒత్తిడి, వర్క్ టెన్షన్ లలో బాధపడుతున్నవారు వెంటనే వారికి దగ్గరలోని బ్యూటీ పార్లర్ కో,  స్పా సెంటర్ కో వెళ్లి మసాజ్ లాంటివి చేయించుకుంటారు. అలా చేయించుకోవడం వల్ల ఒత్తిడి కొంత మేర తగ్గుతుంది. దీంతో.. వారు రిలీఫ్ గా ఫీలౌతారు. ఇలాంటి థెరపిలు చాలానే ఉన్నాయి. అయితే.. ఇప్పుడు మరో కొత్త రకం వైద్యం వెలుగులోకి వస్తోంది. అదే ‘‘ఫారెస్ట్ థెరపి’’. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న ఈ ‘‘ ఫారెస్ట్ థెరపి’’ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

‘‘ ఫారెస్ట్ థెరపి’’ దీనిని మొదట జపాన్ దేశంలో ప్రారంభించారు. మానసిక, శారీరక ఒత్తిడికి లోనయ్యే వాళ్లు.. కొంత సమయం కనుక     అడవిలో గడిపితే.. వారు ఆ ఒత్తిడి నుంచి కోలుకుంటారు అనే కాన్సెప్ట్ తో వచ్చింది ఈ ఫారెస్ట్ థెరపి. రిలాక్సేషన్, స్ట్రెస్ మేనేజ్ మెంట్ యాక్టివిటీ భాగంలో భాగంగా ఈ థెరపీని ప్రవేశపెట్టారు. ఈ విధానాన్ని జపాన్ లో 1982లో  ఫారెస్ట్ ఏజెన్సీ ప్రవేశపెట్టింది. కాగా.. ఇప్పుడు ఈ విధానం స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు కూడా పాకింది.

ఈ థెరపి కోసం ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. మూడు నాలుగు రోజుల పాటు అడవిలో గడిపేందుకు వెళుతున్నారట.  అంతేకాదు.. అలా వెళ్లిన వారికి అక్కడ అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొందరు ఔత్సాహికులు ప్రత్యేకంగా స్పా సెంటర్లు, రీట్రీట్ సెంటర్లు లాంటివి ఫారెస్ట్ లో ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చన్నమాట. కొందరైతే.. ఈ ఫారెస్ట్ థెరపికి సంబంధించి శిక్షణ కూడా ఇస్తున్నారట. మూడు రోజులపాటు సాగే ఈ శిక్షణ అనంతరం వారికి ఆ శిక్షణకు సంబంధించి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారట. అక్కడ ఉండే బొనాటికల్ గార్డెన్ లాంటి వాటిల్లో ప్రశాంతంగా పర్యటించవచ్చు. ప్రస్తుతానికి ఈ రకం వైద్యం మన దేశంలో అందుబాటులో లేదు కానీ.. భవిష్యత్తులో ఇక్కడ కూడా కచ్చితంగా వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

click me!