సభలో నవ్వులు పూయించిన లోకేష్

First Published Nov 14, 2017, 11:19 AM IST
Highlights
  • సభలో నవ్వులు పూయించిన లోకేష్
  • మంత్రిని ప్రశ్నలు అడిగిన శాసనసభ్యులు
  • సమాధానాలు ఇచ్చిన మంత్రి లోకేష్

ఏపీ మంత్రి లోకేష్.. మంగళవారం శాసనసభలో నవ్వులు పూయించారు. మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమవ్వగానే ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. సభలో శాసనసభ్యులు ‘ గ్రామంలో పారిశుధ్యం’ అంశంపై ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే లోకేష్ సభ్యులందరినీ నవ్వించారు.

ప్రతీ గ్రామంలో ఎక్కడికెళ్లినా చెత్త కనపడుతోందని చెబుతూ లోకేష్ ఒక్కసారిగా నవ్వారు. ఆయన నవ్విన వెంటనే.. సభలోని సభ్యులంతా కూడా నవ్వేశారు. అనంతరం తిరిగి లోకేష్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. గ్రామంలోకి ఎంటరయ్యే ముందు ఎక్కువగా చెత్త పేరుకుపోయి ఉంటోందని.. అందుకే ప్రతీ ఇంటికీ రెండు చెత్త బుట్టలు ఇస్తున్నామని లోకేష్ తెలిపారు. తడి, పొడి చెత్తను ఇంటి దగ్గరే వేరుచేసి డంప్ యార్డ్ కు చేర్చేందుకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

డంపింగ్ యార్డ్ కు తీసుకువచ్చిన తడి చెత్తతో వర్మి కంపోస్టు చేసి పంచాయితీకి ఆదాయం కలిగిలే చేస్తామని పేర్కొన్నారు.ఇందుకు పాణ్యం నియోజకవర్గంలోని ఓ మహిళా సర్పంచ్ ఉదాహరణ అని తెలిపారు. ఆ సర్పంచ్ వర్మి కంపోస్టు ద్వారా రూ.35లక్షలు సంపాదించారని చెప్పారు. 2019 నాటికి వర్మి కంపోస్టు ద్వారా వెయ్యి కోట్లు సంపాదించే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

click me!