
నోట్ల రద్దు తో సామాన్యులను అతలా కుతలం చేసిన కేంద్రం ఇటీవల ఏటీఎంలను మూసివేసి సరికొత్త ఇబ్బందులు సృష్టిస్తోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు బ్యాంకు ఖాతాదారులకు మరో సాక్ ఇవ్వడానికి సిద్ధమైంది.
ఈ నెల 30 లోపు బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డును అనుసంధానం చేయకపోతే ఇకపై సదురు ఖాతాదారుడి బ్యాంకు ఖాతాను బ్లాక్ చేస్తామని ప్రకటించింది.ఖాతాదారుడి వివరాలను ఆధార్ తో లింక్ చేయాలని ఆదాయపు పన్నుశాఖ ఆదేశాలిచ్చింది.
ఇందుకోసం ఈ నెల 30 వరకే గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఆధార్ అనుసంధానం చేయకుండా ఖాతాదారుడు తన ఖాతా నుంచి ఎలాంటి లావాదేవీలు జరపకుండా బ్లాక్ చేస్తారు.
అంతేకాదు జూలై 2014 నుండి ఆగస్ట్ 2015 మధ్య బ్యాంక్ ఖాతా తెరిచిన వారు ఆధార్ తో పాటు KYCని కూడా బ్యాంకులకు ఇవ్వాలని సూచించింది.
ఈ మేరకు కొత్త నిబంధనలపై ఖాతాదారులకు సమాచారం అందించాలని, సూచనలు ఇవ్వాలని కేంద్రం అన్ని బ్యాంకులకు సూచించింది.