పవన్ పై జేసీ సంచలన వ్యాఖ్యలు

First Published Nov 30, 2017, 2:22 PM IST
Highlights
  • పవన్ రాజకీయాలకు పనికిరాడన్న జేసీ
  • పవన్ రాజకీయ జీవితానికి చిరంజీవే శాపమన్న జేసీ

సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హాయిగా సినిమాలు తీసుకోకుండా పవన్ కి రాజకీయాలు ఎందుకని జేసీ పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ రాజకీయప్రవేశం గురించి స్పందించారు. పవన్‌ రాజకీయ జీవితానికి ఆయన అన్న చిరంజీవి శాపంగా మారారని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేసినా తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. చిరంజీవి తన పార్టీని విలీనం చేసి తప్పు చేశారని అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా తనకు ఇక ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం లేదని చెప్పారు. పార్లమెంట్ కి వెళ్లి ఏమి చేయాలని ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు అనుగ్రహిస్తే తన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయిస్తానని చెప్పారు. ఎంపీలందరూ కూరల్లో కరివేపాకు లాంటివాళ్లేనన్నారు.రాజకీయాల్లో అందరిపైనా అవినీతి ఆరోపణలు ఉంటాయని అన్నారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిపై వచ్చిన అవినీతి ఆరోపణల సంగతి ఏంటని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి తమ పార్టీలో చేరితో ప్రభాకర్‌చౌదరి కింద ఎందుకు పనిచేస్తారని, చంద్రబాబు కింద పనిచేస్తారని దివాకర్‌రెడ్డి చెప్పారు.

click me!