బాబుకు ‘భారతరత్న’ కోసం జీవితమంతా కృషి చేస్తా...

First Published Aug 14, 2017, 5:41 AM IST
Highlights
  • చంద్రబాబుకు ‘అపర భగీరథ’ అనే బిరుదు వచ్చేలా చేస్తా
  • చంద్రబాబుకు ‘భారతరత్న’ వచ్చేందుకు జీవితమంతా కృషి చేస్తా
  • పోలవరం ప్రాజక్టు రహస్యం కేంద్రంబయటపెడుతుందని బాబు భయపడుతున్నాడు

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి  తాను ఏ విధంగా అడ్డుపడుతున్నానో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల ముందు పెట్టాలని కాంగ్రెస్  రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు కోరారు.

అది  నిరూపిస్తే తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని శాశ్వాతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని కూడా కెవిపి స్పష్టం చేశారు.‘పోలవరం పూర్తిగా నిర్మించి గ్రావిటీ ద్వారా 2019కి నీరు ఇవ్వగల్గితే, ఆంధ్ర ప్రజలను ఎలగైనా ఒప్పించి ‘అపర భగీరథుడు’ అన్న బిరుదును చంద్రబాబుకి ఇప్పిస్తానని కెవిపి పేర్కొన్నారు. అంతే కాదు, చంద్రబాబుకి ‘భారత రత్న’ సాధించడానికి తన శేష జీవితాన్ని కృషి చేస్తానని కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు.

లేదా  ’నాపై చేసిన ఆరోపణలు తప్పు అని చంద్రబాబు అంగీకరించాలి. ఆయన రాజీనామా చేయాలని నేనేమీ డిమాండ్ చేయను,’ అని ఆయన అదివారం నాడు ముఖ్యమంత్రికి రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. తాను పోలవరం ప్రాజక్టును అడ్డుకుంటున్నానని  ముఖ్యమంత్రి తో పాటు, తెలుగుగుదేశం నేతలంతా ఆరోపణలుచేస్తున్నందుకు జవాబు గా కెవిపి ఈ లేఖ రాశారు.సవాల్ విసిరారు.

‘‘మీకు నైతికత ఉంటే నా చాలెంజ్ స్వీకరించాలి’ అని  కెవిపి సి ఎంకు ఎదురు సవాల్ విసిరారు.

తెలంగాణా ముంపు మండలాల ఆంధ్రలో కలుపుతూ   ను ఆర్డినెన్సు జారీ చేయకపోతే 2014 లోొ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనని బెదిరించగానే ప్రధాని నరేంద్రమోదీ గారు గడగడా వణికి జ్వరం తెచ్చుకొనిఆర్డినెన్స్ ఇచ్చారన్న  చంద్రబాబు ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారునుకోవడం భ్రమ అని  కెవిపి చెప్పారు.  రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదాతో పాటు పలు విభజన హామీలను కేంద్రానికి తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నది నిజం కాదా అని  కెవిపి  ప్రశ్నించారు.

‘పోలవరం ప్రాధాన్యతను చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన పదేళ్ల కాలంలో (1995-2004) మధ్యన గుర్తించి ఉంటే ఈ రోజు ఆంధ్రా పరిస్థితి వేరుగా ఉండేది. ఇపుడు ఆయనపోలవరం పోలవరం అని అరి చేది  రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే నాతో సహా ఎవరికి అభ్యంతరం లేదు., ఇప్పటి పోలవరం ప్రాజక్టులో రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలే ఎక్కువున్నాయి.

పోలవరం గురించి కేంద్రం పార్లమెంట్‌లో ఈ రహస్యం బయటపెడుతుందేమో అనే భయంతోనే పోలవరం గురించి ఎవరు ఏం మాట్లాడినా చంద్రబాబు ఆయన భజన బృందం ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. నా ఈ చాలెంజ్‌ను చంద్రబాబు ఒప్పుకోవాలి. లేకుంటే చంద్రబాబు వ్యక్తిగత స్వార్థంతోనే ప్రాజెక్టును తన చేతులోకి తీసుకున్నారని రుజువు అవుతుంది,’ అని కెవిపి అన్నారు.

click me!