బ్లూవేల్ ఛాలెంజ్.. మరో బాలుడు బలి..!

Published : Aug 13, 2017, 05:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
బ్లూవేల్ ఛాలెంజ్.. మరో బాలుడు బలి..!

సారాంశం

ముఖానికి ప్లాస్టిక్ కవర్  చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడడ్డాడు భారత్ లో ఈ ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి.

 

అత్యంత ప్రమాదకరమైన ఆన్ లైన్ గేమ్ బ్లూవేల్ ఛాలెంజ్ కి మరో బాలుడు బలయ్యాడు.  ముఖానికి ప్లాస్టిక్ కవర్  చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడడ్డాడు. భారత్ లో ఈ ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి.

వివరాల్లోకి వెళితే..పదో తరగతి చదువుతున్న అంకన్‌ అనే విద్యార్థి స్కూలు నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి వస్తానని చెప్పి  బాత్ రూమ్ లోకి వెళ్లాడు. ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి బాత్‌రూమ్‌లో చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. గమనించిన తల్లిదండ్రులు అంకన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మెడచుట్టూ పాలిథిన్‌ కవర్‌ను గట్టిగా చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చివరి సారిగా అతడు బ్లూవేల్‌ గేమ్‌ ఆడుతూ కనిపించినట్లు సమాచారం.

మూడు రోజుల క్రితం మహారాష్ట్రలోని రెండు ప్రాంతాల్లో ఇద్దరు విద్యార్థులు బ్లూవేల్‌ గేమ్‌ ఆడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా కాపాడారు. గత నెల ముంబయికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి ఎత్తైన భవనం మీద నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో బ్లూవేల్‌ గేమ్‌ ఆత్మహత్య భారత్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగిన వెంటనే మరిన్ని ఘటనలు బయటికి వస్తున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !