
హైదరాబాద్ మహానగరం చుట్టూ అర్బన్ లంగ్ స్పేస్ లను ఏర్పాటు చేస్తున్నామని మునిసిపల్ శాఖ మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు.
నగరంలో కాలుష్యం తగ్గించేందుకు చుట్టూర భారీగా వనాలను, ఉద్యావనాలను పెంచాలని యోచన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర అటవీ శాఖ, పట్టణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా నగరం చుట్టూ 180 ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు.