
తెలంగాణా ఐటి మంత్రి కె తారకరామారావు శనివారం నాడు అహ్మదాబాద్ లో ఉన్న సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు.ఆశ్రమం వద్ద ఆయనకు పూలమాల వేసి చిన్నారులు పలికారు చిన్నారులు. అనంతరం ఆయన ఆశ్రమం కలియ తిరిగి, అక్కడ భద్రపరిచిన వస్తువులను తిలికించారు.
శుక్రవారం అహ్మదాబాద్ లో జరిగిన టెక్స్ టైల్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఆయన గుజరాత్ వచ్చినసంగతి తెలిసిందే.
తన సబర్మతి ఆశ్రమ సందర్శన గురించి ఆయన ట్వీట్ చేశారు.
మంత్రి వెంట జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ఉన్నారు.