రామ్ నాథ్ కోవింద్ మరచి పోలేని హైదరాబాద్ అనుభవం

Published : Jul 05, 2017, 08:42 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
రామ్ నాథ్  కోవింద్ మరచి పోలేని హైదరాబాద్ అనుభవం

సారాంశం

ఎవరి పాదాభివందనమయినా,శాలువ అయినా,  చార్ మినార్ మెమెంంటో  వంటి కానుకలయినా రాజకీయాలలో రాజకీయావసరాల వల్లే అందివ్వాల్సి ఉంటుంది. రాజకీయాలలో రాజకీయాతీతంగా ఏదీ ఉండదు. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క మెసేజ్ ను పంపిస్తారు నేతలు. పాదాభివందనం బహుశా చాలా చాలా బలంగా రాజకీయ సందేశం పంపించడానికి  మార్గమేమో.

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఎన్డీయే అభ్యర్థి రామ్ నాధ్ కోవింద్ కు  వైసిసి నేత జగన్మోహన్ రెడ్డి పాదాభివందనం చేయడం చర్చనీయాంశమయింది. ఇది కోవింద్  మరచిపోలేని అనుభవం. అందునా దక్షిణాదికి చెందిన బలమయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదాభివందనం దళిత నాయకుడు కోవింద్ హృదయం మీద చెరగని ముద్ర వేసి ఉంటుంది.

 

నిన్న హైదరాబాద్‌ వచ్చిన కోవింద్ ఒక స్టార్‌ హోటల్లో వైసీపీ ప్రతినిధులతో సమావేశమయినపుడు వైసీపీ అధ్యక్షుడు మొదట పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. తర్వాత శాలువా కప్పి సత్కరించారు. ఆపైన అందరినీ ఆశ్చర్యపరుస్తూ కోవింద్‌కు జగన్‌ పాదాభివందనం చేశారు.

 

సాధారణంగా ఇలాంటి పని కెసిఆర్ చేస్తారని అనుకుంటాం. ఎందుకంటే, ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందడం చూశాం. అలాగే రెగ్యులర్ గా గవర్నర్ నరసింహన్ నుంచి కూడా పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందుతుంటారు. గతంలో చాలా కాలం కిందటఆయన ప్రొఫెసర్ జైశంకర్ కి పాదాభివందనం చేశారు. యుపిఎ ప్రభుత్వంలో ఉన్నపుడు సోనియాగాంధీకి కూడా పాదాభివందనం చేసి తెలంగాణాఆశీస్సులు పొందారు.

 

అంతకుముందు  పాదాభివందనం చేయించుకునే ముఖ్యమంత్రి(ఎన్టీయార్)ని చూశాంగాని ఆ పని పబ్లీకున చేసిన ముఖ్యమంత్రులెవరూ కనిపించలేదు. ఇలాగే పెద్ద హోదాలో ఉన్న నాయకులు కూడా పాదాభివందనం చేసిన దాఖలా లేదు.

 

నిజానికి జగన్ కోవింద్ కు పాదాభివందనం చేయడం తప్పేమీ కాదు. వయసులో బహాశా జగన్ ఆయన మనవడు లేదా చిన్న కొడుకు వయసు ఉండవచ్చు. అందువల్ల పెద్ద వాళ్ల ఆశీస్సులు పొందేందుకు జగన్ అలా చేసి ఉంటారని అనుకుందాం. అయితే, ఆయన ఎపుడు పెద్ద వాళ్లకుఅలా పాదాభివందనం చేసి ఆశీస్సులందుకున్నట్లు కనిపించదు. ఆయన చాలాసార్లు రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. పాదాభివందనం చేసినట్లు బయటకు వార్తలయితే రాలేదు. అలాగే ప్రధాని మోదీని కూడా కలుసుకున్నారు. ఎపుడూ పాదాభివందనం చేసినట్లు లేదు. అంటే జగన్ కు ఆ పద్ధతిలో ఆశీస్సులు పొందే అలవాటు లేదనే కదా. మొదటి సారి ఎంపి అయినపుడు ఆయన సోనియాకు పాదాభివందనం చసినట్లయితే వార్తలు రాలేదు.

 

అందుకే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ కాళ్లు మొక్కటం కొంత వింతగా ఉంది.  చర్చనీయాంశమయింది. జగన్ పాదాభివందనం తర్వాత కోవింద్‌, వెంకయ్య నాయుడు తదితరులు వేదికపై ఆసీనులై ఉండగా, అక్కడికి వచ్చిన రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి కూడా  వంగి కోవింద్‌ కాళ్లకు వందనం చేశారు.

 

ఎవరి పాదాభివందనమయినా,శాలువ అయినా,  చార్ మినార్ మెమెంంటో అయినా రాజకీయాలలో రాజకీయావసరాల వల్లే అందివ్వాల్సి ఉంటుంది. ఇదొ క రాజకీయ భాష. రాజకీయాలలో రాజకీయాతీతంగా ఏదీ ఉండదు. జగన్ కు  ఇది అంతఅవసరమో...

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !