
సాధారణంగా ఇలాంటి పనులు రాజకీయ నాయకులు చేస్తుంటారు. పొలం దున్నడం,ఎద్దుల బండినడపడం, రిక్షాతొక్కడం... ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని వేరే చెపాల్సిన పనిలేదు.
ఉన్నతాధికారులు ఇలాంటి పనులు చేయరు. వారికి పబ్లిసిటీ అసవరం లేదు. ప్రభుత్వ విధానాలుకచ్చితంగా అమలు జరిపి ప్రజలు మేలు అందేలా చూడటం వారి పని. అయితే, అపుడపుడు కొంత మంది అధికారులు చాలా ముందుకెళ్లి, ప్రజలతో కలసి పోయి కష్టసుఖాలు స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి పనే ఈ కలెక్టర్ చేశారు.
మెదక్ జిల్లా కలెక్టర్ భారతి వరి మడిలోకి దూకారు. ఆమెకు సేద్యం మీద, ముఖ్యంగా వరిమడిలో మహిళా వ్యవసాయకూలీలు నాట్లు వేస్తుండటం ఆమెను ఆకట్టుకుంది. అందుకే అమె బురద లెక్క చేయకుండా వరి మడిలోకి దూకి నాట్లు వేయడం మొదలుపెట్టారు.
ఆదివారం మెదక్ మండ లం అవుసులపల్లి గ్రామంలోని వ్యవసా య పనులను పరిశీలిం చడానికి వచ్చారు. అక్కడ ఆమె నాట్లు వేస్తున్న మహి ళా కూలీలను చూసి ముచ్చటపడ్డారు. వెంటనే వారితో జతకట్టి, నారు వేయడంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
అంతే కాకుండా వ్యవసాయంపై తన 3 సంవత్సరాల కూతురు ఆధ్యాకు కూడా వివరించారు. చిన్నారి చేతకూడా చిట్టి నాట్లు వేయించారు.
ఈ సందర్భంగా నాటు వేసే పద్ధతిని అక్కడున్న రైతులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి వ్యవసాయం చేయడాన్ని ఆమె పూర్తిగా అభినందించారు.