
పన్నీరు సెల్వం... తమిళనాడు మఖ్యమంత్రిగా కంటే.. అమ్మ భక్తుడిగానే అందిరికీ ఎక్కువగా తెలుసు.
ఆ ఒక్క అర్హతే ఆయనను మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది.
అమ్మ ఉన్నప్పుడు వీరవిధేయతతో పార్టీలో ఎప్పుడూ ఫస్టు ర్యాంకు తెచ్చుకున్న పన్నీరు ఇప్పుడు ‘అమ్మ’ మాటనే ధిక్కరించేశాడు.
జయలలిత మృతిచెందిన తర్వాత తొలిసారిగా సమావేశమైన ఆ రాష్ట్ర మంత్రివర్గ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇందులో అందిరి దృష్టిని ఆకర్షించింది.. ఎవరు ఊహించనది ఒకటి ఉంది.
గతంలో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఓ వివాదాస్పద ప్రాజెక్టును నిలిపివేశారు. అయితే సీఎం పన్నీర్ సెల్వం మంత్రివర్గం మాత్రం శనివారం ఆ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
మధురవాయల్- చెన్నై పోర్టు ఫ్లైఓవర్ పనుల పునరుద్ధరణ ప్రాజెక్టు కు గతంలో అమ్మ అనుమతి ఇవ్వలేదు. అయితే పన్నీరు పీఠం ఎక్కగానే వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అలాగే, ఈ మంత్రివర్గ భేటీలో మెరీనాబీచ్‌లో జయలలిత ఘాట్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఇంకా అమ్మ స్మారక స్థూపం ఏర్పాటుకు నిర్ణయించారు.
అయితే పన్నీరు తన మొదటి కేబినెట్ మీటింగ్ లోనే అమ్మ రద్దు చేసిన వివాదాస్పద ప్రాజెక్టు కు అనుమతి ఇవ్వడం ఇప్పుడు వివాదంగా మారుతోంది.