పోలీసులతో కోదండరామ్ వాగ్వాదం (వీడియో)

Published : Oct 14, 2017, 12:58 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
పోలీసులతో కోదండరామ్ వాగ్వాదం (వీడియో)

సారాంశం

అరెస్టుపై కోదండ రామ్ అభ్యంతరం, అరెస్టు వారంటు చూపాలని డిమాండ్

 

 

అమర వీరుల స్పూర్తి యాత్రకు జనగామ  బయలుదేరిన  జేఏసీనేత ప్రొఫెసర్ కోదండరామ్ ను  నారాపల్లి వద్ద  తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు.  కోదండరాం తో సహా అనేక మంది ఇతర నేతలను కూడా  అరెస్టు చేసి  ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ కు  తీసుకెల్తున్నారు. అరెస్టుకు ఆయన తీవ్ర అభ్యంతరం చెప్పారు. అరెస్టు అర్డర్ చూపించాలని  డిమాండ్ చేశారు. సివిల్ పోలీసులు మాత్రమే అరెస్టు చేయాలని, మఫ్టీలో ఉన్న వారు చేయరాదని ఆయన అభ్యంతరం చెప్పారు. ఈ విషయం మీద పోలీసులకు, కోదండరామ్ కు చాలా సేపు వాగ్వాదం నడిచింది.  అరెస్టు వారెంట్ చూపే దాకా  తన వాహనం దిగనని మొండికేశారు.  పోలీసు వాహనం ఎక్కేందుకు చాలా సేపు నిరాకరించారు.  పోలీసుల దగ్గిర ఏ కాగి తం లేదు. సరికదా సివిల్ పోలీసులు కూడా రంగంలో లేరు. డిటెన్షన్ రూల్సు తెలియవా, సుప్రీం కోర్టు అరెస్టు గైడ్ లైన్స్ తెలియవా అని ఆయన ప్రశ్నించారు. (వీడియో చూడండి.)

 ఈ  యాత్ర ఈ రోజు వరంగల్ నుంచి ప్రారంభమయింది. అయితే, అర్థరాత్రి నుంచే అరెస్టులు మొదలయ్యాయి.

మొదట ఈ ఆరవ దశ స్ఫూర్తి యాత్రను అడ్డుకోవడానికి టీజేఏసీ వరంగల్, జనగామ,మహబూబాబాద్ నాయకులను, కార్యకర్తలను, విద్యార్థి నాయకులను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత అరెస్టు చేశారు. అరెస్టులింకా కొనసాగుతున్నాయి. ఇదే విధంగా జనగాం లో పోలీసులు దగ్గరుండి జెఎసి జండాలను తీసేయించారు. ఈ అరెస్టులను టీజేఏసీ తీవ్రంగా ఖండించింది. అరెస్టులతో తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అడ్డుకోలేరని తక్షణం అరెస్టులు ఆపాలని కోదండ రామ్ కోరారు.  అరెస్టు చేసిన వారందరినీ విడుదలచేయాలని ఆయన డిమాండ్ చేశారు.. అరెస్టయిన వారిలో సోషల్ మీడియా నాని, శ్రీను, బాల లక్ష్మి (ఉస్మానియా)  సారయ్య, ప్రశాంత్( కాకతీయ)లు ఉన్నారు. మానుకోట జిల్లా జేఏసీ నేతల అక్రమ అరెస్ట్ ను  వరంగల్ జెఎసి తీవ్రంగా ఖండించింది.  కెసిఆర్  ప్రభుత్వానికి  జేఏసీ అంటే భయం పట్టుకుందని అందుకే ఈ అరెస్టులని వరంగల్ జిల్లా టిజాక్ కన్వీనర్ బొనగాని రవీందర్ అన్నారు.‘కోదండరాం మాటలు ప్రజలకు సూటిగా చేరుతున్నాయి. ఇది తెలుకున్న ప్రభుత్వం పోరు గడ్డపై  కోదండరామ్ యాత్ర కు బ్రేక్ వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. అందులో  భాగమే అరెస్టులు,’ అని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu