పుస్తక ప్రియులకు శుభవార్త.. గీతాప్రెస్ మూతపడటం లేదు

First Published Oct 14, 2017, 12:31 PM IST
Highlights
  • 95ఏళ్ల చరిత్ర కలిగిన గీతా ప్రెస్
  • మూసివేస్తున్నారంటూ వార్తలు
  • రూమర్స్ అంటూ కొట్టి పారేసిన సంస్థ

గోరఖ్ పూర్ లోని ‘గీతా ప్రెస్’.. పరిచయం అవసరం లేని సంస్థ. సర్వమతాలకు నిలయమైన గోరఖ్ పూర్ లో గీతా ప్రెస్.. చాలా ప్రసిద్ధి. ఆధ్యాత్మిక పుస్తకాలను ప్రచురించడంలో గీతా ప్రెస్.. అగ్రగామి సంస్థ. కేవలం పుస్తకాలను ప్రచురించడమే కాదు.. ప్రపంచంలో ఎక్కడా లేనంత తక్కువ ధరకే ఆ పుస్తకాలను విక్రయిస్తుంది ఈ సంస్థ.

1923వ సంవత్సరంలో జయదయాళ్ గోయంద్కా అనే మర్వాడీ వ్యాపారీ దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 65కోట్ల పుస్తకాలను ఈ ప్రెస్ ప్రచురించింది. వాటిలో అన్నీ మహాభారతం, రామాయణం, రామ చరితమానస్, శ్రీమద్ భాగవతం వంటి పుస్తకాలే. అత్యంత ఎక్కువ క్వాలిటీతో 14 భాషల్లో ఈ పుస్తకాలను ప్రచురించారు.

అయితే.. తాజాగా ఈ ప్రెస్.. పుస్తకాల ప్రచురణను స్పీడప్ చేయాలనుకుంటోంది. అందు కోసం జర్మనీ నుంచి ప్రత్యేకంగా ఒక మెషిన్ ని కూడా తెప్పించారు. ఆ మెషిన్ కోసం వారు రూ.11కోట్లు ఖర్చు చేశారు. ఈ మెషిన్ సహాయంతో పుస్తకాలను అత్యంత క్వాలిటీగా ప్రింట్ చేయవచ్చని, అంతేకాకుండా పుస్తకాల బైండింగ్ కూడా త్వరగా చేయవచ్చని ప్రెస్ మేనేజర్ తిరుపతి చెబుతున్నారు. ఇప్పటి వరకు గీతా ప్రెస్ లో పుస్తకాల బైండింగ్ మాన్యువల్ గా జరిగేది. దీంతో దీనికి చాలా సమయమే పట్టేది. కానీ ఈ మెషిన్ సహాయంతో త్వరగా పూర్తౌతోందని తిరుపతి తెలిపారు.

కొద్ది రోజులుగా ఈ గీతా ప్రెస్ ని మూసివేస్తున్నారని.. అందులో పనిచేసే వర్కర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నారంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వాటిని ప్రెస్ మేనేజర్ తిరుపతి తోసి పుచ్చారు. తమ గీతా ప్రెస్.. స్థాపించిన రోజు నుంచి నిర్విరామంగా పనిచేస్తోందని చెప్పారు. ప్రస్తుతం తమ ప్రెస్ లో 200మంది వర్కర్లు పనిచేస్తున్నారని..వారందరికీ జీతాలు కూడా బాగానే ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

గీతా  ప్రెస్ ని రక్షిద్దాం అంటూ కొందరు ప్రజల వద్ద నుంచి డొనేషన్లు వసూలు చేస్తున్నారని ఆ విషయం తమ వద్దకు వచ్చిందని తిరుపతి చెప్పారు. తమ సంస్థ ఎలాంటి డొనేషన్లు స్వీకరించదని తెలిపారు. అలా చెప్పి డబ్బులు వసూలు చేసేవారిని నమ్మవద్దని హెచ్చరికలు జారీ చేశారు

.

ప్రజలకు అత్యంత తక్కువ ధరకు పుస్తకాలు అందించడమే తమ గీతా ప్రెస్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. దీని వల్ల తమ సంస్థకు నష్టం వచ్చినా పర్వాలేదని తెలిపారు. గీతా వస్త్ర విభాగ్ పేరిట దుస్తులు, ఆయుర్వేద మందులు అమ్ముతున్నామని.. వాటి ఆదాయంతో గీతా ప్రెస్ నష్టాలను భర్తీ చేస్తున్నామని ఆయన వివరించారు.

click me!