కెటిఆర్ కు గల్ఫ్ తెలంగాణ ప్రవాసుల విజ్ఞప్తి

First Published Oct 25, 2017, 3:01 PM IST
Highlights

ఎన్ ఆర్ ఐ పాలసీ కోసం గల్ఫ్ తెలంగాణ ప్రవాసులు సంతకాల సేకరణ ఉద్యమం

గల్ఫ్ కార్మికుల అవగహనా వేదిక అద్వర్యంలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల కోసo ఎన్ ఆర్ ఐ పాలసీ  తొందరగా తీసుకురావాలని  లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం  గల్ఫ్ లో  జోరుగా సాగుతున్నది.ఇప్పటిదాకా  గల్ఫ్ లో ఉన్న తెలంగాణ కార్మికులలో  5000 మంది సంతకాలు చేశారు.

 ఈ సంతకాలతో ఉన్న వినతిపత్రాన్నిఈరోజు ఎన్ ర్ ఐ మంత్రి కేటిర్ గారికి ఇ-మెయిల్ ద్వార పంపించడం జరిగింది, ఈ నెల చివరన వారికి మరొక సారి ప్రత్యక్షంగా అందజేయడం  జరుగుతుంది.
గల్ఫ్ కార్మికులకు భద్రత కోసం, సంక్షేమం కోసం ఎన్ ఆర్ ఐ పాలసీని  తొందరగా రూపొందించి అమలు చేయాలని కోరుతూన్నాను.

ఈ సంతకాల కార్యక్రమం ఎంతో శ్రమతో చేయడం జరగుతూ ఉందని వేదిక ప్రతినిధి కృష్ణా దొనికెని చెప్పారు. ఈ 5000  మంది సంతకాలను  ఆషామాషిగా సేకరించలేదు.  ఈ కార్మికులందరికి  ఎన్ ర్ ఐ పాలసి, అంటే ఏమిటి, అది ఎందుకు అవసరం, దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు  వివరించేందుకు వారందరనిని వ్యక్తి గతంగా కలుసుకుని అవగాహన కల్పించి సంతకాలు చెయించడం జరిగింది.
అతి తక్కువ సమయo లో ఈ సంతకాలు సేకరించామని చెబుతూ  సోషల్ మీడియ మద్దత్తూ లేకపోతే, ఇది సాధ్యమయ్యేది కాదని  ఆయన  చెప్పారు.  

గల్ఫ్ లో  ప్రవాస తెలంగాణ యాక్టివిస్టులు బాబుస్వామి, శేకర్, తిరుపతి, రవి, కొమురన్న, లక్ష్మీరాజo, శంకర్ (మస్కట్), చిన్ను (బెహరైన్), మహి (కువైట్), రమణ (సౌదీ),వెంకట్ , అడువాల సత్యo, కిరణ్ , సురేందర్ , అడువాల భూమన్న, జగన్, వంశీ, బుర్ర సత్యం, ఆశోక్ బక్కశేట్టి -సజ్జ, ch రమేశ్, p రాజు, బల్గo సతిశ్, లక్ష్మీనర్సయ్య, బల్గo శంకర్, p శేకర్, అర్మూర్ గణేశ్, అసం గణేశ్, నవీన్ ఈ సంతకాల సేకరణకు సహకారం అందించారని చెబుతూ వాందరికి గల్ఫ్ కార్మికుల అవగహనా వేదిక కు చెందిన కృష్ణా దొనికేని కృతజ్ఞతలు చెప్పారు.

click me!