అందులో సక్సెస్ అయిన చంద్రబాబు

First Published Jan 7, 2018, 10:24 AM IST
Highlights
  • అనంతపురానికి తరలివచ్చిన కొరియా కంపెనీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు సాధించేసారు.  ఎంతకీ  ఏం సాధించారు..? ఎందులో సాధించారు..? ఇదే కదా మీ సందేహం. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజధానిని వివిధ దేశాల మాదిరిగా తయారు చేస్తానని పలు సందర్భాల్లో చెప్పడం అందరికీ గుర్తుండే ఉంటుంది.  అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశాల ప్రతినిధులను ఆహ్వానించారు కూడా. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక దేశాన్ని ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానిస్తూనే ఉన్నారు. ఆ దేశ ప్రతినిధులు కూడా.. సరే అంటూ తలవూపారే తప్ప. ఏ ఒక్కరూ ముందుకు అడుగు వేసింది లేదు. కానీ.. తాజాగా కొరియా దేశం ముందుకు వచ్చింది.

అనంతపురం జిల్లా పెనుకొండ ప్రాంతంలో ఇప్పటికే కొరియా కంపెనీలు పనులు ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో ‘కియ’ కార్ల కంపెనీని ప్రారంభించనున్నారు. దీని పనులే ఇప్పుడు అక్కడ శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం నాలుగు కంపెనీల పనులు అక్కడ జరుగుతున్నాయి. 50మంది కొరియన్లు పనిచేస్తున్నారు. హ్యుండాయ్ కార్ల పరిశ్రమకు చెందిన మరో 50మందికిపైగా ఉన్నతస్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఈ కంపెనీలు కనుక పూర్తి అయితే.. ఏపీలో కొందరికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఈ విషయంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.

click me!