నాలుగోసారి ఏటీఎంలో డ్రా చేస్తే రూ.20 కట్

Published : Mar 05, 2017, 12:13 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
నాలుగోసారి ఏటీఎంలో డ్రా చేస్తే రూ.20 కట్

సారాంశం

తమ ఖాతాదారులకు ఎస్ బీఐ కఠిన నిబంధనలు విధించి కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి సరికొత్త షాక్ లు ఇవ్వబోతోంది.

సర్వీసు చార్జీలు భారీగా వడ్డిస్తూ తమ ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్ బీఐ) షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది.

 

మీ అకౌంట్ లో పైసా లేకున్నా ఇంకా దాన్ని కొనసాగించాలనుకుంటే ఇక కుదిరే పరిస్థితి ఉండదు. బ్యాంకు నిబంధనలకన్నీ తక్కువ డబ్బు మీ అకౌంట్ లో ఉన్నా కూడా ఇకపై పెనాల్టీ విధించేలా కొత్త రూల్సు తీసుకొచ్చారు.ఈ నిబంధన పాతదే, ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు దీన్ని తిరిగి తీసుకొస్తున్నారు.

 

ఇక పై ఎస్ బీ ఐ బ్యాంకుల్లో  నెలలో మూడుసార్లు మాత్రమే ఫ్రీగా నగదు డిపాజిట్  చేయోచ్చు. అంతుకు మించితే నాలుగో డిపాజిట్‌ నుంచి రూ. 50 సేవా పన్ను, సర్వీస్ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌ఎంఎస్‌ అలర్ట్ పై కూడా బాదుడు మొదలుపెట్టింది.

 

అంతేకాదు ఏటీఎంలో మనీ డ్రాలపై కూడా నిబంధనలు కఠినం చేసింది. బ్యాంకు ఖాతాలో రూ.25 వేల కన్నా ఎక్కువ మొత్తం ఉంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా సొంత ఏటీఎంల నుంచి ఎన్ని సార్లైనా న‌గ‌దు డ్రా చేయోచ్చు. అదే  వేరే బ్యాంకు ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసినప్పుడు ఛార్జి పడకుండా ఉండాలంటే లక్ష రూపాయలు ఖాతాలో ఉండాల్సిందే.

 

మినిమమ్ బ్యాలెన్స్ కన్నా అకౌంట్ లో 50 శాతం తక్కువ మొత్తం ఉంటే సర్వీస్‌ ఛార్జితో కలిపి రూ.50 జరిమానా చెల్లించాలి. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ మూడు సార్లు దాటితే రూ.20 ఛార్జి చేస్తారు. ఎస్‌బీఐ ఏటీఎంలలో నగదు ఉపసంహరణ ఐదు సార్లు దాటితో రూ.10 చొప్పును ఛార్జి చేస్తారు.

 

కొత్తగా అమల్లోకి తెచ్చిన ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్ బీఐ యాజమాన్యం ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !