జనసేన నేత పవన్ మీద ‘కత్తి’ దాడి

First Published Dec 9, 2017, 4:29 PM IST
Highlights

అసలు జనసేన పార్టీయే కాదు, అదొక ట్విట్టర్ గోల

జ‌న‌సేనాని మీద సినీ క్రిటిక్ మహేశ్ మరొకసారి  క‌త్తి దూశాడు. గత మూడు రోజులుగా అంటే పవన్ రాక రాక ఉత్తరాంధ్ర వచ్చినప్పటినుంచి మహేశ్ కత్తి ఝళిపిస్తూనే ఉన్నాడు.  పవన్ ఏవిధంగా ట్విట్టర్ వేదికయే, కత్తి మహేశ్ కు ఫేస్ బుక్ పెట్టని కోట. ఇపుడాయన  ప‌వ‌న్‌పై కారాలు మిరియాలు నూరారు. జ‌న‌సేనలో ఉండేదంతా  కుల‌పిచ్చిగాళ్లేనని బాగా ఘాటైన  వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ఆదుకొనకపోతే జనసైనికులు వెర్రివెంగలప్పవుతారని అన్నారు.

 

`రూల్స్ ప్ర‌కారం చూసుకుంటే జ‌న‌సేన అస‌లు పార్టీయే కాదు. కేవ‌లం ట్విట్టర్ పార్టీ. రాజ‌కీయ పార్టీ కావడానికి కావాల్సిన బేసిక్ అర్హ‌త‌లు లేని పార్టీ. చంద్ర‌బాబుగారు ద‌య‌తో కొన్ని సీట్లు కేటాయించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా హోదా క‌ల్పించ‌క‌పోతే మ‌రో జ‌న‌రేష‌న్ యూత్ వెర్రివెంగ‌ల‌ప్ప‌లుగా మిగిలిపోతారు. జ‌నం లేరు. సేన లేదు. పిచ్చి అభిమానులు, కుల పిచ్చిగాళ్లు మాత్రం ఉన్నారు` అని కామెంట్ చేశారు ఒక గంట కిందట. ఇందులో నిజమెంతో అబ్దమెంతో వివరించాల్సిన పనిలేదు. మనకు జనసేన గురించి బాగా తెలుసు. కత్తి మహేశ్ గురించి తెలుసు.

 

అంత‌కుముందు రెండు గంటల కిందట ఇలా అన్నారు. ప్రతిదానికీ 'చంద్రబాబు కి తెలియకపోవచ్చు' అంటావేంటయ్యా బాబూ... ఆయన ముఖ్యమంత్రి కాడా లేక అంత పనికిమాలినవాడు అని నీ అభిప్రాయమా!? లేక ఎలా వెనకేసుకు రావాలో నీకు అర్థం కావడం లేదా! Get some good advisors, consultants and language trainers. Do you want me to suggest some, I will.

 

 అంతకంటే ముందు ఏమన్నారో తెలుసా?

స్పెషల్ స్టేటస్ అంటే జోకైపోయింది. వైజాగ్ రమ్మని పిలుపినిచ్చావ్. నువ్వు మాత్రం రాలేదు. మీ దోస్త్ చంద్రబాబు స్పెషల్ ప్యాకేజికి, స్టేటస్ కి తేడాలేదు అనేస్తాడు. నువ్వు మళ్ళీ స్టేటస్ కావాలంటే పోరాడాలి అంటావు. మేము రెడీ అంటే, ముందు నేను పోరాడతా అంటావ్. అసలు ఒక్క విషయం మీద అయినా క్లారిటీ ఉందా! ఆ క్లారిటీ లేదనే విషయం అయినా క్లియర్గా అర్థం అవుతోందా?!

 

 

 

 

click me!