జయను కీర్తించిన కరుణ

First Published Dec 8, 2016, 1:28 PM IST
Highlights

తాజాగా అక్కడ వెలసిన డిఎంకె నిలువెత్తు పోస్టర్ ఒకటి అందరినీ హ్రుదయాన్ని కదిలిస్తోంది. సదరు పోస్టర్ లో జయలిలత నిలువెత్తు కటౌట్ ను ఏర్పాటు చేసారు.

సినిమాల్లో నాయకుడి గొప్ప తనం తెలియాలంటే, ప్రతినాయకుడు కూడా గట్టివాడుగానే ఉండాలంటారు. ఇద్దరూ తమిళనాడుకు చెందిన వారే కాబట్టి, అందులోనూ సినిమా వాళ్లే కాబట్టి పై నానుడిని నిజం అయింది. దశాబ్దాల తరబడి తమిళనాడులో కరుణానిధి, జయలలిత ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేది.

 

రాజకీయంగా వారిద్దరూ ఎంతటి ప్రత్యర్ధులో అందరికీ తెలిసిందే.  వ్యక్తిగతంగా కరుణానిధి దివంగత ముఖ్యమంత్రి  జయలలితను ఎంత గొప్పగి కీర్తిస్తారనే విషయం ఇపుడు వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం దివికేగిన జయను మెరీనాబీచ్ వద్ద ఖననం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా అక్కడ వెలసిన డిఎంకె నిలువెత్తు పోస్టర్ ఒకటి అందరినీ హ్రుదయాన్ని కదిలిస్తోంది. సదరు పోస్టర్ లో జయలిలత నిలువెత్తు కటౌట్ ను ఏర్పాటు చేసారు.

 

దానిపై కరుణానిధి సంతకంతో రెండు వాఖ్యలు కనిపిస్తాయి. అవి చదివిన వారి హృదయాలు భారంతో రోధిస్తున్నాయి. అందులో ఈ విధంగా రాసి ఉంది.  ‘‘జయలలిత మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. విరోధిగా జయ ఉన్నప్పటికి ఎదుట నిలిచింది సింహమనే హుందాతో నిలబడ్డాం. మీరు పాలించకూడదని మాత్రమే భావించాం గానీ… జీవించకూడదని ఎన్నడూ భావించలేదు...తల్లి. ఇక ఎక్కడ చూడగలం... నీలాంటి ఖ్యాతికలిగిన మహోన్నతమైన వ్యక్తిని” అని డీఎంకే శ్రేణులు ఫ్లెక్సీలపై రాశాయి.

click me!