ఇప్పుడు ఇదే భారత దేశ ‘ATM’a

First Published Dec 8, 2016, 11:44 AM IST
Highlights
  • ఎక్కడ చూసిన ఏటీఎంల చుట్టే  ప్రదక్షణలు
  • ‘క్యూ’ లోనే కూలబడిన ఆర్థిక వ్యవస్థ

 

                                                                  కనబడుటలేదు

 

గళ్ళ చొక్కా , నల్ల ప్యాంట్ వేసుకుని , తలకి కొబ్బరినూనె రాసుకుని , పక్క పాపిడి తలదువ్వుకుని , ముఖానికి పాండ్స్ పౌడరు రాసుకుని , పాలిష్ చేసిన బాటా బూట్లేసుకుని వెళుతూ వెళుతూ "అమ్మా ! ATM కి వెళ్ళొస్తా " అని మూడ్రోజుల క్రితం చెప్పి వెళ్ళాడు . ఇంత వరకూ ఇంకా ఇంటికి రాలేదు .

బాబూ రాంబాబు , నువ్వు ఏ ATM దగ్గర లైన్లో ఉన్నా , వెంటనే ఇంటికి వచ్చేయి బాబూ. నీకోసం ఇక్కడ పనిమనిషి , పాలవాడు , పేపరువాడు ,పిల్లల స్కూలు బస్సు వాడు , చేబదులు ఇచ్చిన పక్కింటి పిన్నిగారు అందరూ నువ్వెప్పుడొస్తావా అని బెంగతో మంచం పట్టారు .

నువ్వు తప్పకుండా డబ్బు తీసుకొస్తావని వేయి కళ్ళతో మేమందరము ఎదురుచూస్తున్నాము .

ఇట్లు

మీ అమ్మ

 

దేశంలో ఏటీఎంలు ఇప్పుడు ఎంత బీజీగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఒక్క లేఖ చాలు.. అందుకే సోషల్ మీడియాలో ఈ సెటైర్ వైరల్ గా మారింది.

 

 

నవంబర్ 8 కి ముందు

 

 

ఇరుకు గదిలో .. నాలుగు అడుగుల ఎత్తులో ఉన్న ఆ మిషన్ అంటే ఎవరికీ పెద్ద లెక్క లేదు.

 

నవంబర్ 8 తర్వాత

 

ఇప్పడు ఆ ఇరుకు గదే ఇంటిల్లిపాదికి ఇలవేల్పుగా మారింది. ఆ నాలుగు అడుగుల మిషన్ ప్రతి ఇంటి మా లక్ష్మి అయింది.

 

ఇప్పటికైనా మీకు అర్థమైందా.. మీము చెప్పేది గల్లికొకటిగా దర్శనమిచ్చే ఏటిఎంల గురించి అని.

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో అందరూ ఎక్కువగా వెతికింది ఏటిఎంల గురించే.

 

అడ్రస్ వెతుక్కోని మరో ఏటిఎంల ముందు బారులు తీరారు. కాస్త చిల్లర రాలుస్తుందోనని ఆశగా చూశారు.

 

మనమేంటి... గూగుల్ కూడా ఏటిఎంల గురించే తెగ సెర్చ్ చేసింది. చివరకు తన హోం పేజీలో కూడా ఏటిఎం అడ్రస్ లను పెట్టేసింది.

 

టెకీలు మాత్రం తక్కువ తిన్నారా... ఎక్కడ ఏ ఏటిఎం ఉందో చెప్పడానికి తెగ కష్టపడి యాప్ ను కూడా సృష్టించారు.

 

ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం లాభం ఏటిఎంలు ఎక్కడ పనిచేశాయని.. అలా డబ్బులు  నిండగానే జనాలు క్షణాల్లో వాటిని ఖాళీ చేసేస్తున్నారు.

 

ఈ నెల రోజుల్లో చిత్రవిచిత్రాలన్నీ ఏటిఎంల దగ్గరే చోటుచేసుకున్నాయి.

 

ముంబై లో ఓ యువతి తనను మోసం చేసిన మాజీ ప్రియుడ్ని ఏటీఎం క్యూలోనే కనిపెట్టి చితగ్గొట్టింది.

 

ఉత్తరప్రదేశ్ లో ఓ గర్భిణీ ఏటీఎం క్యూలోనే బిడ్డకు జన్మనిచ్చింది.

 

కాళ్ల పారాణితో ఏటిఎం క్యూలో నిల్చున్న పెళ్లికూతుళ్లకు లెక్కేలేదు.

 

అరుంధతి నక్షత్ర దర్శనం కంటే ముందే ఏటిఎంను దర్శించుకున్న కొత్త జంటలున్నాయంటే అతిశయెక్తి కాదు.

 

ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశ ఆత్మ అంతా ఈ నెల రోజుల నుంచి  ఏటిఎంల చుట్టే తిరిగింది... తిరుగుతూ.... ఉంది.

 

click me!