బదిలీ కోసం వస్తే బెడ్రూంకి రమ్మన్నాడు
కర్ణాటక ఎక్సైజ్ మంత్రి రాసలీలలు
యూ ట్యూబ్ లో వైరల్ గా మారిన వీడియో
ప్రతిపక్షాల ఒత్తిడితో పదవికి రాజీనామా
కర్నాటక అసెంబ్లీలో నీలి చిత్రాలు చూస్తూ ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిన విషయం మరవకముందే అదే రాష్ట్రంలో ఓ మంత్రిపై లైంగికవేధింపుల ఆరోపణలు వచ్చాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత హైచ్‌వై మేతీ కర్ణాటక ఎక్సైజ్ మంత్రి. ఉద్యోగ బదిలీ విషయంపై తన వద్దకు వచ్చిన ఓ మహిళతో ఆయన రాసలీలలు సాగించారన్న ఆరోపణలకు సంబంధించి వీడియో ఒకటి యూ ట్యూబ్ లో వైరల్ గా మారింది.
దీనిపై రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి.
ఎట్టకేలకు దీనిపై స్పందించిన మంత్రి తానెలాంటి తప్పూ చేయలేదని, తనకు సంబంధించిన వీడియో ఉంటే ఆన్ లైన్ లో పెట్టాలని సవాల్ విసిరారు.
యూ ట్యూబ్ లో ఉన్న వీడియోలో ఉన్నది తాను కదని స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా, మంత్రి రాజీనామాపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఆయన తన పదవికి రాజీనామా చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని పేర్కొన్నారు.
రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదం కోసం పంపించానని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.