
రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిజం లోవున్న కాపు కులస్తులకు అవసరమైయిన వీడియో కెమెరాలను, స్టిల్ కెమెరాలను కార్పొరేషన్ ద్వారా అందిస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ప్రకటించారు . శుక్రవారం కాపు కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అస్సోసిషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ( పెన్ జాప్ ) రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ విజ్ఞప్తికి స్పందిస్తూ ఇది చాల న్యాయమైన కోరికని కార్పొరేషన్ ద్వారా అర్హతగల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లోని జర్నలిస్టులకు , వీడియో జర్నలిస్టులకు , ఫోటో జర్నలిస్టులకు వారికీ అవసరమైయిన పరికరాలను అందిస్తామని రామానుజయ హామీ ఇచ్చారు . ఇతర కులాలలోని జర్నలిస్టులందరికి కూడా లబ్ది చేకూరేవిధంగా ఆయా కార్పొరేషన్ ల చైర్మన్ లతో సమన్వయ పరుచుకుని తగిన ఏర్పాటు చేస్తానని కూడా ఆయన అన్నారు. చైర్మన్ కు విజ్ఞాపన పత్రం సమర్పించినవారిలో రాష్ట్ర సంఘ నాయకులు సింహాద్రి కృష్ణ ప్రసాద్ , మెహెర్ బాబా , బండ్రెడ్డి కిశోర్ కుమార్ , సనక ప్రసాద తదితరులు వున్నారు .